Asianet News TeluguAsianet News Telugu

2 వేల మంది తెలంగాణ వాళ్లను తరిమేస్తున్నారు ఇలా...

about 2 thousand Telangana expats being sent home from Saudi

ఉపాధి కోసం ఉన్న ఊరిని వదిలి గల్ఫ్‌ వెళ్లితే అక్కడా అంక్షల కష్టాలే వెంటాడుతున్నా యి. ఈ అంక్షల్లో భాగంగా సౌదీ అరేబియాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈతనిఖీల్లో ప ట్టుబడిన తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు 2వేల మంది కార్మికులు తిరుగుపయన మయ్యారు. ప్రధానంగా అకామ లేకుండా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్న కార్మి కులకు తిప్పలు తప్పడం లేదు.ఈనిబంధనలు అక్టోబ రు నుండి జనవరి వరకు కొనసాగుతాయి. ఈమూడు నెలల్లో పట్టుబడిన కార్మి కులను ఇ...ంటికి పంపిస్తున్నా రు. దాదాపు రెండు లక్షల మంది కార్మికులు అక్రమంగా ఉంటున్నారని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడా ది క్షమాభిక్ష (అమ్నెస్టీ)ని అమలు చేయడంతో దాదాపు 25 వేలమంది కార్మికులు తిరిగివచ్చారు.

about 2 thousand Telangana expats being sent home from Saudi

 

భవన నిర్మాణ రంగంలో కార్మికులు...

సౌదీలో తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉ మ్మడి జిల్లాలకు చెందిన వేలాది కార్మికులు భవన ని ర్మాణ రంగంలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నా రు. మరికొందరు డ్రైవర్‌లుగా, తోటల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఎక్కువ కాం ట్రాక్టర్ల వద్ద కార్మికులు అకామ తీసుకొని పను లు చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు అకామ ఇవ్వకుండా కార్మికులను తిప్పుకుంటారు. ఇటు వంటి కార్మికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పాత కంపెనీల నుంచి వచ్చిన కార్మికులు, విజిట్‌ విసా, అజాద్‌ విసాపై వెళ్లిన కార్మికులకు సౌదీ అంక్షల కష్టాలు నెలకొన్నాయి. వర్క్‌ పర్మిట్‌, రెసి డెంట్‌ పర్మిట్‌ లేకుండా, దేశసరిహద్దులు దాటి సౌది వెళ్లిన కార్మికులు కష్టాల్లో పడినట్లే.

తనిఖీలు ముమ్మరం...

సౌదీ అరేబియాలోని రియాద్‌, దమ్మం, జిద్దాలో పోలీ సులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కార్మికులు నివసించే గదులపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. గదుల్లో ఉంటున్న కార్మికుల వద్ద విసా, పాస్‌పోర్టు, గుర్తింపు కార్డులు, అకామలు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే వదిలివేస్తున్నారు. ఈ పత్రాల లో ఏవి లేకున్నా వెంటనే పట్టుకొని అరెస్ట్‌ చేస్తున్నారు.

అరెస్ట్‌ అయిన కార్మికులు జైలు నుంచి ఇంటికే..

సౌదీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉం టూ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న కార్మి కులను అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తున్నారు. 20 రోజులు జైల్లో పెట్టి ఆతర్వాత టికెట్‌ ఇచ్చి పంపించేస్తున్నారు. కాంట్రాక్టరు డబ్బులు ఇవ్వలేదు

about 2 thousand Telangana expats being sent home from Saudi

 

‘‘కాంట్రాక్టరు డబ్బులు ఇవ్వలేదు’’

-శంకర్‌, హాన్మాజీపేట

సౌదీ వెళ్లి డ్రైవర్‌ పనిచేశాను. రి యాద్‌లో పోలీసుల తనిఖీలు తీవ్ర మయ్యాయి. నేను కోరుట్లకు చెందిన సౌదీలో ఉంటున్న కాంట్రాక్టరు వద్ద పనిచేశాను. 8 నె లల వేతనం ఇవ్వలేదు. చివరికి ఇంటికి వచ్చేశాను. కాం ట్రాక్టర్లు కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ లక్షలు గడి స్తున్నారు. వారిపై చర్య తీసుకోవాలి.

‘‘అవుట్‌ పాస్‌పోర్టు ఇచ్చి పంపించేస్తున్నారు’’

-సుభాష్‌, నిర్మల్‌

అకామ లేకండా అక్కడే ఉంటూ ఉ పాధి పొందుతున్న కార్మికులను పట్టు కొని అవుట్‌ పాస్‌పోర్టు ఇచ్చి పంపిం చే స్తున్నారు.తెలంగాణలోని వేలాదిమంది కార్మి కులు సౌదీలో ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ సారి నిబంధనలు కఠినం చేశారు. దీంతో ఎలాంటి పత్రా లు లేకుండా ఉండడం కష్టంగానే ఉంది.

 

(* రచయిత కుమారస్వామి చారి, సౌదీ దమ్మామ్ లో పనిచేస్తున్నారు.)