store bannerగుండె పగిలే కర్నూలు జ్ఞాపకమిది

గుండె పగిలే కర్నూలు జ్ఞాపకమిదిఇన్ని సంవత్సరాలు అయినా అదుకొని..ప్రజలు ప్రభుత్వాలు.. 
కర్నూలు లో వరదలు బీభత్సం సృష్టించి ధాధాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఆ గాయం ఇంకా
మానలేదు...

 అక్టోబర్ 3,2009


ఆరోజు రోజు లానే ఆకాశం నిర్మలంగా వుంది..
రెండు రోజుల నుండి వర్షాలు మాత్రం పడ్తున్నాయి..
టీవీ లో ఎక్కడా రాయలసీమ లో భారీ వర్షాలు అని
చూపలే మాకు ఎలాగూ పడదులే అనుకుని అలా
పక్కన పోతున్న నది వంక చూసా నిర్మాలన్గా రోజు లానే
పారుతుంది ఈ పక్కన హంద్రి కూడా అంతే ఎందుకో
నది నీరు మాత్రం ఎర్రగా మారి కొంచెం కొంచెం వేగం అందుకుంటుంది..అక్కడక్కడా చిన్న చిన్న కొమ్మలు మాత్రం కొట్టుకుంటూ వెళ్తున్నాయి..
ఆకాశం వంక ఇంకోసారి చూసా చిన్నగా వర్షం మొదలయింది .
ఇంటికొచ్చి టీవీ పెట్టా వార్తల్లో ఎమన్నా చెప్తారని
రోజు లాగే రాజకీయా వార్తలతో ఉదర గొడుతున్నారు..
కర్ణాటక లో అయితే భారీ వర్షాలు అని మాత్రం చెప్పారు..
మనసులో ఎక్కడో ఆనందం హమ్మయ్య జూరాల నిండి
మన శ్రేశైలం ప్రాజెక్టు నిండితే రాయలసీమ కు ఈ సారన్నా
నిండి రైతులు బోర్లలో కాసిన్ని నీళ్ళు వస్తాయన్న ఆశ..
సాయంత్రం అయింది ఈ వర్షం ఈ సారీ గట్టిగా పడతుందే
అని మనసులో చిన్న ఆందోళన మొదలయింది..

 

 

రాత్రి 8 అయింది అన్నం తిని అలా బయటకెళ్తే నది
సౌండ్ చెవిన పడింది హోరున 
ఎందుకో డౌట్ వచ్చి అలా tg వెంకటేష్ ఇంటి గుండా
వెళ్లి చూస్తే చీకటిలో నది మహోగ్ర రూపమయి పైన
రోడ్డు వరకు మసీదును తకుతున్నాయి నీళ్ళు..
నాకు ముచ్చెమటలు పట్టాయి ఇంత భయంకరంగా
నదిని మేం ఎప్పుడు చూడలేదు..
వెంటనే వచ్చి టీవీ పెట్టా ఎమన్నా చెప్తారని ఎవరు
ఏమి చెప్పలేదు..అవే రాజకీయా వార్తలు..
రాత్రి టైం 9.30 బయట జనాల హడావిడి చూసి
వస్తే నది నీళ్ళు ఇళ్ళలో వస్తున్నాయి అన్నారు..
అందరూ ఒక్కసారి ఉలిక్కి పడిి చూస్తే అప్పటికే చివరన
ఉన్న టీజ్ వెంకటేష్ ఇళ్ల పరిసరాల్లోకి నీళ్ళు రావడంమ్
మొదలయింది..
చివరికి అందరూ చూస్తుండగానే నెళ్లన్నీ ఒక్కసారి
కాలనీ వెంబడి నడుములోతు పైన చేరుకున్నాయి..
ఇంట్లో ఉన్న డబ్బు లు కొన్ని బూక్లు విలువైన ఆభరణాలు
పైన మిడ్డీ పైకి చేర్చమ్..
రాత్రి 12 నీళ్ళు క్రమంగా పెరుగుతున్నాయి నది చివరి
కాలనీ లు పూర్తిగా నీట మునిగాయి కట్టు బట్టలతో
కొన్ని డబ్బులు నగలతో కొంత మంది బయట పడ్డారు..
మిద్దెలెక్కిన వారు వర్షం ఒకవైపు కింద మొదటి ఫ్లోర్ లు
మొత్తం నీటమునిగాయి కురెంటు ఎప్పుడో రాత్రే పోయింది
చిమ్మ చీకట్లు..డబ్బులు,సెర్టిఫికేట్ లు,ఇంళ్ళలో షాప్ లలో
సమన్లు,బియ్యం అన్ని సర్వం ఆ ఎర్రటి బురద నీళ్ళలో
కొట్టుకొని పోయాయి కళ్ళముందే...
వాకిళ్లు వేసిన ఇళ్లల్లో మొత్తము బురద చొచ్చు కొచ్చింది....
ఇంత జరిగిన తరువాత పోలీస్ లు అక్కడక్కడా
విజిల్ వేస్తూ అందర్నీ దూరం పోండీ.. అని కేకలు
కానీ కళ్ళముందే ఇంట్లో సర్వస్వం నీటిపాలు కావడం
ఎటు పోవలో తెలీదు చేతిలో చిల్లి గవ్వ లేదు..
ఆ రాత్రి నుండి బయటపడడం పొద్దునె పట్టణం అంత
భయంకరమైన నీళ్ళు అక్కడక్కడ కొట్టుకొస్తున్న జంతువుల కళేబరాలు....
(ఇంకా వుంది)

 

 

 

వై.రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ కాలమిస్టు

Show Full Article