Asianet News TeluguAsianet News Telugu

విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు సిట్...అందులో ఏముందంటే...: విజయసాయి రెడ్డి

గత ప్రభుత్వ హయాంతో విశాఖపట్నం భూ కుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్ నివేధికలో సంచలన విషయాలు దాగున్నాయని వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వాటిని పరిశీలించాకే తాము కొత్తగా మరో సిట్ ను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.  

ysrcp mp vijayasai reddy reveals chandrabu government SIT report on vizag land scam
Author
Visakhapatnam, First Published Oct 31, 2019, 8:09 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అవతరణ ధిత్సవాన్ని నవంబర్ ఒకటిన ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గతంలో చంద్రబాబు ఈ ఉత్సవాలను అటక ఎక్కించారని....ఆయన జూన్ 2 నుంచీ వారంపాటు నవనిర్మాణ దీక్ష అంటూ బెంజి సర్కిల్లో ట్రాఫిక్ ఇబ్బందులు పెడుతుండేవారని గుర్తుచేశారు.

ఆయన పాలనలో 97 వేలకోట్ల అప్పు రెండున్నర లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. ఇందులో అత్యధికం దుర్వినియోగం అయ్యిందన్నారు. నిధులు ఇవ్వకుండానే కేవలం పేరు కోసమే కొన్ని పథకాలు పెట్టారని ఎద్దేవా చేశారు.

విశాఖలో జరిపిన పార్టనర్ షిప్ సమ్మిట్లలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు జరిగిందంతా కేవలం ప్రచారమేనని అన్నారు. జగన్ పాలనలో అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేస్తున్నామని...విశాఖకు మహర్దశ పడుతోందన్నారు. 

read more  పోలవరంపై హైకోర్టు తీర్పు... ఇరిగేషన్ మంత్రి ఏమన్నారంటే...

 విశాఖ సమగ్రాభివృద్ధికి జగన్ కంకణం కట్టుకున్నారన్నారు. గతంలో దివంగత వైఎస్సార్ మాత్రమే విశాఖను అభివృద్ధి చేశారని ఇప్పుడు ఆయన తనయుడు జగన్ చేయడానికి సిద్దమయ్యారని అన్నారు. సాంస్కృతిక, ఆర్ధిక రాజధానిగా విశాఖ ఎదుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

భూకుంభకోణాల మీద కొత్త సిట్ ఏర్పాటు చేశామని... దీని పరిధి కూడా పెంచనున్నట్లు ప్రకటించారు. ముందు ఇసుక కొరత అన్నారు,ఇపుడు ఇసుక మాఫియా, ఇసుక దోపిడి అంటున్నారని...వాటిని నిరూపించే దమ్ముందా అని సవాల్ విసిరారు. లేదంటే రాజకీయాల నుంచి వైదొలగుతారా అని ప్రశ్నించారు.

శాంతి భద్రతలను అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. అవినీతి అరికట్టి ప్రజారంజక పాలనను రానున్న పాతికేళ్లపాటు కొనసాగించడానికి జగన్ సిద్దంగా వున్నారని తెలిపారు. 

read more జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు...మాజీ ఐఏఎస్ శర్మపై ఇంకో కేసు

చంద్రబాబు భూకుంభకోణాల మీద వేసిన సిట్ రిపోర్టు ఇచ్చినా దాన్ని బహిర్గతం చేయలేదని... ప్రస్తుత ప్రభుత్వం ఆ రిపోర్టు పరిశీలించిందన్నారు. అందులో మంత్రులను రక్షించే ప్రయత్నం జరిగిందని గుర్తించామని... ఇంకా విస్తారంగా విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని పరిధి ఇతర ప్రాంతాలకు పెంచాలని, సమయం కూడా పెంచాలనీ కోరామన్నారు.

అమరావతి మీద శివరామకృష్ణ కమిటీ నివేదికను, నారాయణ కమిటీ నివేదికనూ పరిశీలించి కొత్త కమిటీ సిఫార్సులను అనుసరించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఏపీలో 13 జిల్లాలూ సమంగా అభివృద్ధి చెందాలని జగన్ బలంగా ఆశిస్తున్నారని... వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను సమంగా సమగ్రంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

"

మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలకు ఎప్పటినుంచో అవకాశం ఉందన్నారు. ఇపుడూ అవే చట్టాలున్నాయని.... వాటిని మార్చటం ఎవరివల్లా కాదన్నారు.  వార్తని వార్తగా రాయాలని...విమర్శలు చేస్తే దానికి ఆధారం ఉండాలి సూచించారు.  విమర్శ సహేతుకంగా లేకుంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని హెచ్చరించారు.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడని... 2014 లోనే అతడు అమ్ముడుపోయాడని విమర్శించారు. అయితే ఆ కాల్షీట్స్ ఇంకా అమల్లో ఉన్నాయని... ఇంకా అవే నడుస్తున్నాయన్నారు. దీన్ని గుర్తించే ప్రజలు రెండు చోట్ల ఆయన్ని ఓడించారని  ఎద్దేవా చేశారు. ఇక చిన్ననాయుడు అయిదేళ్లు తిని ఇపుడు నాలుగు గంటలు దీక్ష చేస్తే లాభం లేదని...అతడి ఇసుక దీక్ష హాస్యాస్పదంగా సాగిందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios