Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

 ఆమె రిటర్న్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యింది. తర్వాతి మరో టెస్టులో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురై శృతి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు  దించి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
 

woman commits suicide for not getting job
Author
Hyderabad, First Published Sep 27, 2019, 11:10 AM IST

ఉన్నత విద్యను అభ్యసించింది. మంచి ఉద్యోగం వస్తుందని ఎన్నో కలలు కూడా కన్నది. ఆ ఉద్యోగం సాధించడానికి చాలా శ్రమించింది. కానీ ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. వచ్చినట్లే వచ్చి ఉద్యోగం చేజారింది. దీంతో మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన చిర్ర రవీందర్- రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా...  పెద్ద కుమార్తెకు, కుమారుడికి ఇటీవల వివాహం జరిగింది. చిన్న కుమార్తె శృతి ఎంబీఏ చదివింది. ఇటీవల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే ఆమె రిటర్న్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యింది. తర్వాతి మరో టెస్టులో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురై శృతి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు  దించి ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో మృతురాలు తండ్రి రవీందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవీందర్‌ కేసు నమోదు చెసుకొని దర్యాప్తు జరిపారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios