Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసి స్ట్రైక్ ఎఫెక్ట్... అకోలా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దశంకరంపేట వద్ద అకోలా రహదారిపై ఆర్టీసి  బస్సు తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.   

rtc strike effect....road accident at akola highway
Author
Shankarampet, First Published Oct 5, 2019, 9:55 AM IST

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సమీపంలో శనివారం  తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఆర్టీసి బస్సు  ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 14మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

rtc strike effect....road accident at akola highway

ఈ ప్రమాదానికి ఆర్టిసి సమ్మె కారణమయ్యింది. ఆర్టిసి ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో తాత్కాలిక డ్రైవర్లలో బస్సులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయయణఖేడ్ డిపోకే చెందిన బస్సును తాత్కాలిక డ్రైవర్ నడపగా ఈ ప్రమాదం జరిగింది.  

డ్రైవర్ కొత్తవాడు కావడమే కాదు సమ్మె నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఎక్కువగా వుండటం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమ్మె కారణంగా అరకోరగా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో సామర్థ్యానికి మించి ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రయాణికులు ఎక్కువగా వుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుంటోంది. 

ఈ ప్రమాదంలో తుఫాన్ లో ప్రయాణిస్తున్నవారికే ఎక్కువగా గాయాలయ్యాయి. అలాగే బస్సులోని వారికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. గాయపడినవారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆర్టీసి బస్ తో పాటు తుఫాన్  వాహనం కూడా దెబ్బతింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios