Asianet News TeluguAsianet News Telugu

బాబు చనిపోవడం బాధకారం.. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా: గంగుల

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులారా యూనియన్ల మాయలో పడి ఇబ్బందుల పలు కాకూడదని వారికి విజ్ఞప్తి 
చేశారు. యూనియన్ నాయకులు విధులు నిర్వహించకుండా కేవలం అజమాయిషీ చేస్తున్నారు.

Minister Gangula Kamalakar Comments on RTC Strike
Author
Hyderabad, First Published Nov 3, 2019, 4:03 PM IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె శుక్రవారం 28వ రోజుకి చేరింది.  ప్రభుత్యం తమ డిమాండ్లను నెరవేర్చలేని కార్మకులు ఓవైపు సమ్మేను కొనసాగిస్తు ఉంటే మరో ప్రభుత్వం నో అంటుంది వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతం అవుతున్నప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

 ఆర్టీసీని ప్రభుత్వంలో విలినం చేయాలనే కార్మికుల డిమాండ్ సాధ్యం కాదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.  దీంతో కార్మికులు నిరసనల హోరెత్తిస్తున్నారు. స్థానిక మంత్రులు,ఎమ్మెల్యే దగ్గర నిరసనను వ్యక్తం చేస్తూ  డిమాండ్లను నెరవేర్ఛాలని కోరుతున్నారు.

ఢిల్లీ కి ఆర్టీసీ పంచాయితీ.. అమిత్ షా ను కలవనున్న ఆర్టీసీ కార్మికులు

తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులారా యూనియన్ల మాయలో పడి ఇబ్బందుల పలు కాకూడదని వారికి విజ్ఞప్తి 
చేశారు. యూనియన్ నాయకులు విధులు నిర్వహించకుండా కేవలం అజమాయిషీ చేస్తున్నారు.

బడుగు బలహీనర్గాలకు చెందిన వారు కార్మికులుగా పని చేస్తున్నారు. వారి సంక్షేమం కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం, కార్మికులు కలిసి ఆర్టీసీని కాపాడుకుందాం. బోనస్ వచ్చే స్థాయికి ఆర్టీసీని తీసుకెళ్దాం. ముఖ్యమంత్రి చెప్పిన మేరకు కార్మికులు విధుల్లో చేరాలి అని విజ్ఞప్తి చేస్తున్నా..

ఆర్టీసీతో ఆగరు.. విలువైన ఆస్తులను కేసీఆర్ అమ్మేస్తారు: భట్టి విక్రమార్క


సమ్మెలో రాజకీయ నాయకులు చేరి కార్మికులను రోడ్డు పైకి తీసుకొచ్చారు. బాబు అనే కార్మికుడు చనిపోవడం బాధాకరం. వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నించారు. అంత్యక్రియలకు వెళ్ళిన ఏ పెద్ద నాయకుడు బాబు కుటుంబానికి కనీస సాయం చేయలేదు, 

వారి జెండాలు పట్టుకొని సొంత అజెండాలు నెరవేర్చుకున్నారు.మునిసిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆయా రాజకీయ పార్టీలు బాబు మృతిని వాడుకున్నాయి.నేను బాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తాను

Follow Us:
Download App:
  • android
  • ios