Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులే టార్గెట్... సచివాలయ ఉద్యోగాల పేరిట మోసం

విశాఖపట్నంలో ఓ ఫేక్ కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగలను మోసగించడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. స్థానిక వైఎస్సార్‌సిపి నాయకుల అప్రమత్తతతో కన్సల్టెన్సీ నిర్వహకుల గుట్టు రట్టయ్యింది. 

Fake job consultancy firm busted in vishakapatnam
Author
Vizag, First Published Nov 4, 2019, 9:21 PM IST

విశాఖపట్నం:  కెరియర్ సోర్స్ సర్వీస్ సంస్థ పేరుతో నిరుద్యోగులను మోసగించే ప్రయత్నం చేసిన నిందితులు వైజాగ్ పోలీసుల చేతికి చిక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు.జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు పోస్టులు ఇప్పిస్తామంటే నిరుద్యోగులను మోసగించే ప్రయత్నం చేశారు.   

వీరి ప్రకటనను నిజమేనని నమ్మి మూడు నాలుగు జిల్లాల నుండి వందల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇంటర్వ్యూ లకు హాజరయ్యారు. ఈ విషయం గురించి  తెలుసుకున్న వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కెకె. రాజు, ఇతర నేతలు రంగప్రవేశం చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న సంస్థ ప్రతినిధులను పట్టుకు పోలీసులకు అప్పగించారు. 

అనంతరం కెకె రాజు మాట్లాడుతూ... ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని  మాధవధార ప్రాంతంలోని కెరీర్ సోర్స్ సర్వీస్ పేరిట ప్రయివేట్ కన్సల్టెంట్ కార్యాలయంలో ఎటువంటి అనుమతులు లేకుండా వార్డు, గ్రామ, మండల, జిల్లా కోఆర్డినేటర్ నియామకాలకు సంబందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఇలా ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న దళారులను నమ్మవద్దని ప్రభుత్వం ఏవిధమైన  నోటిఫికేషన్ విడుదల చేసిన అందులో ప్రయివేట్ సంస్థల ప్రమేయం ఉండదని గుర్తు చేశారు.  

read more  జగన్ ది ప్యాక్షనిస్ట్ మనస్తత్వం... సీఎస్ బదిలీకి అదే కారణం..: అచ్చెన్నాయుడు

నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకం జరుగుతుందని  అందుకు  సంబందించి 3 నుంచి 4లక్షల రూపాయలు వసులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటర్వ్యు లు నిర్వహిస్తునట్లు గుర్తించడం జరిగిందన్నారు.  

ఇంటర్వ్యులకు విశాఖపట్నం శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఉన్న వందలాది మంది నిరుద్యోగులను తీసుకొచ్చి వారి డేటా అంతా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నిర్వహించే సంస్థ డేటా కలెక్ట్ చేసుకుని కెరీర్ సోర్స్ సర్వీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్ పేరుతో ఇక్కడ పెద్ద కంపెనీ స్థాపించి ఉద్యోగాలు ఎంట్రీ చేస్తునట్లు సంస్థ సభ్యులు చెప్పారన్నారు.  మీరు ఎందుకు ఇంటర్వ్యూ  నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తే ఏదో రెండు కంపెనీల పేర్లు చెప్పి కన్సల్టెంట్ పేరిట కార్యాలయాలు తెరిచి నిరుద్యోగులకు ఆశచూపిస్తున్నారని అన్నారు .  

ఈ రెండు కంపెనీలు కూడా గడచిన అక్టోబర్ 25 వ తేదిన వార్డు,గ్రామ,మండల,జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి మీటింగ్ జరిగిందని  త్వరలోనే ఈ రెండు కంపెనీలకి టెండర్ వస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసగించి వీరు డేటాబేస్ ను కలెక్ట్ చేయడం జరుగుతుందన్నారు. డేటాబేస్ ను కలెక్ట్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటంటే మీరు ఇచ్చే ఫస్ట్ ప్రయాణం ఫస్ట్ ఇయర్లో వారికిచ్చే 8% వరకు మా కమిషన్ కింద ఇస్తారని సంస్థ సభ్యులు అంటున్నారు.    

read more  హిందుత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే సీఎస్ బదిలీకి కారణమా...?: ఐవైఆర్  

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి విషయంలోని వార్డుల వారీగా నాటి నుండి  నేటి వరకు కూడా ఏం చేసినా పారదర్శకంగా చేయడం  జరుగుతుందని అన్నారు .  ప్రతి పనికి ఆన్ లైన్ సెంటర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడం జరుగుతోందన్నారు. 

గతంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రత్యేకంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ ఔట్సోర్సింగ్  కార్పొరేషన్ ద్వారా పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని వివరించారు. అనంతరం కెరీర్ సోర్స్ సర్వీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ వలి,ఇంచార్జ్  బి.హరీష్ లను ఎయిర్ పోర్ట్ పోలీసు లకు అప్పగించామని రాజు వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios