Asianet News TeluguAsianet News Telugu

Bulbul Cyclone: దూసుకొస్తున్న బుల్ బుల్ తుపాను...పెను విధ్వంసమే

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తీరంవైపు దూసుకొస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారమే తీరం దాటే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.   

Bulbul Cyclone Expected landfall on Nov 9th november... coastal states on alert
Author
Visakhapatnam, First Published Nov 9, 2019, 5:00 PM IST

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి తీరంవైపు దూసుకొస్తున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలినపారు. బుల్ బుల్ గా పిలవబడుతున్న ఈ తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతుంది. 

ఈ తుపాను ప్రస్తుతం ఒరిస్సాలోని పారాదీప్ కి  95 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్ కు దక్షిణ నైరుతి దిశగా 140 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై వుంది. అయితే తుపాను క్రమంగా బలహీన పడుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య కేప్ పుర ప్రాంతంలో ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఈ తుపాను ప్రభావంతో ప్రస్తుతం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన తర్వాత ఈ వర్ష తీవ్రత మరింత ఎక్కువగా వుండే  అవకాశాలున్నాయట. అయితే ఆంధ్రప్రదేశ్ పై దీని ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం లేదని... కేవలం శ్రీకాకుళం, విజయనగరం లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండి చిరుజల్లు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందన్నారు.

read more  పొంచివున్న బుల్ బుల్ తుఫాను...కోస్తాలో ప్రమాద హెచ్చరికలు జారీ

ఈ బుల్ బుల్ తుపాన్ ప్రబావం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే విపత్తు నివారణ విభాగం సంసిద్దమయ్యింది. అలాగే వారికి సహాయం అందించేందుకు తూర్పు నావికాదళానికి చెందిన నౌకలు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నావికా దళ అధికారులు  తెలిపారు.

 ఈ పెను తుపాన్‌ పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు వెళుతోంది. కాబట్టి తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు.  కోస్తాపై కూడా వుండే అవకాశం వుండటంతో అన్ని ప్రధాన పోర్ట్ లను అప్రమత్తం చేశారు.  

read more  బుల్ బుల్ తుఫాను మరింత తీవ్రరూపం...హెచ్చరికలు జారీ

Follow Us:
Download App:
  • android
  • ios