Asianet News TeluguAsianet News Telugu

మొహాలి వన్డే: నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా

భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సీరిస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా రాంచీ వన్డేలో మాత్రం ఓటమిపాలయ్యింది. దీంతో ఆసిస్ కు వన్డే సీరిస్ పై ఆశలు చిగురించాయి. అయితే మోహాలి వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి సీరిస్ ను ఖాయం చేసుకోవాలిన భారత జట్టు భావిస్తోంది. తర్వాత మిగిలే చివరి వన్డేలో యువ ఆటగాళ్లను ఆడించి ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అందువల్ల మూడో వన్డేలో విఫలమైన భారత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 

team india four changes in mohali odi
Author
Mohali, First Published Mar 10, 2019, 1:40 PM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సీరిస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా రాంచీ వన్డేలో మాత్రం ఓటమిపాలయ్యింది. దీంతో ఆసిస్ కు వన్డే సీరిస్ పై ఆశలు చిగురించాయి. అయితే మోహాలి వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి సీరిస్ ను ఖాయం చేసుకోవాలిన భారత జట్టు భావిస్తోంది. తర్వాత మిగిలే చివరి వన్డేలో యువ ఆటగాళ్లను ఆడించి ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అందువల్ల మూడో వన్డేలో విఫలమైన భారత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 

ప్రస్తుతం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తుది జట్టును  ప్రకటించింది. మొత్తంగా రాంచీ వన్డేలో ఆడిన జట్టులో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి.  
మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానంలో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్,  యుజువేంద్ర చాహల్ తో పాటు భువనేశ్వర్ కుమార్ తుదిజట్టులోకి వచ్చారు. 

మొహాలీ వన్డే గెలుపును ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాంచీలో విజయం సాధించిన సీరిస్ పై ఆశలు నిలుపుకున్న ఆసిస్ ఈ మ్యాచ్ ను కూడా గెలిచి తుది వన్డేలో భారత్ తో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తోంది. అయితే భారత్ కూడా చివరి వన్డే వరకు ఆసిస్ కు అవకాశమివ్వకుండా ఈ మ్యాచ్ లోనే సీరిస్ ఫలితాన్ని తేల్చాలనుకుంటున్నారు.

భారత తుది జట్టు: 

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్) శిఖర్ ధావన్, రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీఫర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్,కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా

ఆస్ట్రేలియా తుది జట్టు:

ఆరోన్ ఫించ్(కెప్టెన్),ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, కమిన్స్, బెహ్న్రెడార్ఫ్, ఆడమ్ జంపా
 
Follow Us:
Download App:
  • android
  • ios