Asianet News TeluguAsianet News Telugu

న్యూడిల్లీ వన్డే: భారత జట్టులో రెండు మార్పులు...ముగ్గురు పేసర్లు

భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో న్యూడిల్లీలో ఆరంభమైంది. ఇప్పటికే 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఆతిథ్య, పర్యాటక జట్లకు ఈ వన్డే ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంటుందనేది ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లు పలు మార్పులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అడుగుపెడుతున్నాయి. 

new delhi odi; Jadeja and Shami return for India
Author
New Delhi, First Published Mar 13, 2019, 1:55 PM IST

భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో న్యూడిల్లీలో ఆరంభమైంది. ఇప్పటికే 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఆతిథ్య, పర్యాటక జట్లకు ఈ వన్డే ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంటుందనేది ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లు పలు మార్పులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అడుగుపెడుతున్నాయి. 

వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలైన టీమిండియా ఈ మ్యాచ్ ను ఎట్టిపరిసరిస్థితుల్లో గెలవాలని చూస్తోంది. దీంతో చివరి వన్డేలో విఫలమైన జట్టులో రెండు మార్పులు చేసింది. ముఖ్వంగా చివరి వన్డేలో భారత్ భారీ పరుగులు సాధించినప్పటికి లక్ష్యచేధనకు దిగిన ఆసిస్ సునాయాసంగా బౌలర్లను ఎదుర్కోని విజయాన్ని సాధించిది. దీంతో బౌలింగ్ విభాగంపై దృష్టి పెట్టిన టీం మేనేజ్ మెంట్ ఇద్దరు బౌలర్లకు జట్టులో స్థానం కల్పించారు. 

చివరి వన్డేలో ఆడిన యజువేందర్ చహల్‌, కేఎల్ రాహుల్‌ స్థానాల్లో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు చోటు దక్కింది. ఇలా ఇప్పటికే జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా రూపంలో ఇద్దరు పేసర్లుండగా షమీ రూపంలో మూడో పేసర్ జట్టులో చేరాడు. 

ఇక ఆసిస్ జట్టు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.  తుది జట్టులో షాన్ మార్ష్, బెహ్రండార్ఫ్ జట్టులో స్థానాన్ని కోల్పోగా స్టోయినీస్ , నాథన్ లయాన్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 

భారత్ తుది జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్,రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్‌ శంకర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ షమీ 

ఆస్ట్రేలియా తుది జట్టు: 

ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, స్టొయినిస్‌, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారీ, రిచర్డ్సన్, కమిన్స్,ఆడమ్ జంపా, నాథన్ లయన్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios