Asianet News TeluguAsianet News Telugu

భారత ఓపెనర్ల వరల్డ్ రికార్డు...

మొహాలీ వన్డేలో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఈ సీరిస్ లో మొదటిసారి ఇద్దరు ఓపెనర్లు సమిష్టిగా రానిస్తూ శుభారంభాన్ని అందించారు.  రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ లు అర్థశతకాలతో చెలరేగి భారత స్కోరును సెంచరీ దాటించారు. ఈ క్రమంలో వీరి ఖాతాలో మరో సెంచరీ భాగస్వామ్యం చేరింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల సరసన వీరు చేరిపోయారు.  
   
india openers world record in mohali odi
Author
Mohali, First Published Mar 10, 2019, 3:41 PM IST

మొహాలీ వన్డేలో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఈ సీరిస్ లో మొదటిసారి ఇద్దరు ఓపెనర్లు సమిష్టిగా రానిస్తూ శుభారంభాన్ని అందించారు.  రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ లు అర్థశతకాలతో చెలరేగి భారత స్కోరును సెంచరీ దాటించారు. ఈ క్రమంలో వీరి ఖాతాలో మరో సెంచరీ భాగస్వామ్యం చేరింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల సరసన వీరు చేరిపోయారు.  
  
మొహాలీ మ్యాచ్ ద్వారా రోహిత్-ధావన్ జోడి 15వ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో విండీస్ దిగ్గజ ఓపెనర్లు గోర్డాన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ లతో సమానంగా నిలిచి అత్యధిక ఓపెనింగ్ సెంచరీ భాగస్వామ్యాల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాల రికార్డు భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీల పేరిట వుంది. వీరిద్దరు వన్డే ఓపెనర్లుగా 21 సెంచరీ  భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరి తర్వాత ఆసిస్ మాజీ ఓపెనర్లు గిల్‌క్రిస్ట్‌-మాథ్యూ హేడెన్‌ 16 సెంచరీలతో 2వ స్థానంలో నిలిచారు. వీరి తర్వాత స్థానాన్ని మొహాలీ మ్యాచ్ ద్వారా రోహిత్-ధావన్ జోడీ అక్రమించింది.  

193 పరుగుల భాగస్వామ్యం తర్వాత సెంచరీకి చేరువైన రోహిత్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. దీంతో రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios