Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ వన్డే: మళ్లీ ఫినిషర్ ధోనీయే, ఆసీస్ పై ఇండియా విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ కేదార్ జాదవ్ తో కలిసి భారత్ కు విజయాన్ని అందించాడు. ఆ రకంగా మరోసారి గేమ్ ఫినిషర్ గా తన పేరును నిలబెట్టుకున్నాడు.

hyderabad odi updates
Author
Hyderabad, First Published Mar 2, 2019, 1:48 PM IST

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్ అస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ తో కలిసి ఎంఎస్ ధోనీయే భారత్ కు విజయాన్ని సాధించి పెట్టాడు. 99 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో ధోనీ, కేదార్ జాదవ్ వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. ధోనీ 59 పరుగులతో, కేదార్ జాదవ్ 81 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. 

పది బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా, భారత్ 48.2 ఓవర్లలో 240 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నీల్, జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు.అంతకు ముందు కేదార్ జాదవ్ అర్థ సెంచరీ చేశాడు. 66 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్ 99 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ మందకొడి బ్యాటింగ్ చేసి 66 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అంబటి రాయుడు కూడా రాణించలేదు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జంపా బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

భారత జట్టు 12 ఓవర్లలో వికెట్ నష్టానికి హాఫ్ సెంచరీ సాధించింది. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా పరుగులు సాధించి పెవిలియన్ చేరుకున్నారు.. 237 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసిస్ బౌలర్ కుల్టర్ నైల్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. దీంతో కేవలం 4 పరుగుల వద్దే భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. 

హైదరాబాద్ వన్డేలో టీమిండియా బౌలర్లు ఆసిస్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేయగలిగారు. నిర్ణీత 50 ఓవర్లతో ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులు సాధించి 7 వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా  237 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. 

అంతకు ముందు వరుస ఓవర్లలో భారత బౌలర్ మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట 37వ ఓవర్లో టర్నన్ ను ఔట్ చేసిన షమీ ఆ తర్వాత 39వ ఓవర్లో విద్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఆసిస్ 173 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 

హైదరాబాద్ వన్డేలో భారత బౌలర్ల జోరు కొనసాగింది. ఆసిస్ జట్టు 169 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్ ఆసిస్ బ్యాట్ మెన్ టర్నర్ ఐదో వికెట్ రూపంలో వినుదిరిగాడు. రెండో టీ20 సెంచరీ వీరుడు మ్యాక్స్ వెల్ ఇంకా నాటౌట్ గా ఆడుతుండటం. అతడు కుదురుకుంటే విద్వంసం సృష్టిస్తాడు కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అతడి వికెట్ పడగొట్టాలని టీమిండియా  భావించింది.. దీంతో అతడి వికెట్ టార్గెట్ గానే ప్రయోగాలు చేసింది. 

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసిస్ ను మరింత కష్టాల్లోకి నెట్టారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హ్యాండ్స్‌కోబ్ ను వికెట్ కీఫర్ ధోని స్టంపౌట్ చేశాడు. దీంతో ఆసిస్ 133 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసిస్ మొదటి వికెట్ ను వింటనే పడగొట్టిన టీమిండియా బౌలర్లు రెండో వికెట్ కోసం కాస్త కష్టపడ్డారు, అయితే 87 పరుగుల కుల్దీప్ రెండో వికెట్ పడగొట్టగా మరో పది పరుగుల తేడాతోనే(97 పరుగుల వద్ద) కుల్దీప్ మూడో వికెట్ తీశాడు.హాఫ్ సెంచరీ సాధించిన వెంంటనే ఓపెనర్ ఖవాజాను ఔట్ చేసి ఫెవిలియన్ కు పంపించాడు.   

నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డ ఆసిస్ కు భారత బౌలర్ జాదవ్ దెబ్బతీశాడు. ఆసిస్ స్కోరు సెంచరీకి చేరువవుతున్న తరుణంలో స్టోయినీస్(37 పరుగులు) ను పెవిలియన్ కు పంపించాడు. అయితే ఓపెనర్ ఖవాజా మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని సాధించాడు.

 ఈ మ్యాచ్ లో టీమింండికు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత్ రెండో ఓవర్లోనే గట్టిగా దెబ్బతీసింది. కెప్టెన్ ఆరోన్ పించ్ ను భారత బౌలర్ బుమ్రా బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. 

న్యూజిలాండ్ తో ఆడిన భారత జట్టునే ఈ మ్యాచ్ లో కొనసాగిస్తున్నట్లు  కోహ్లీ వెల్లడించారు. అయిగే గాయం కారణంగా చాహల్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో  అల్‌రౌండర్ జడేజాను తుది జట్టులోకి తీసుకున్నట్లు  తెలిపాడు.  ఆసీస్‌, న్యూజిలాండ్‌ ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్నామని కోహ్లీ అన్నారు. అతను భావించినట్లే భారత్ విజయం సాధించింది.

భారత్ తుది జట్టు: 
 
విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్‌ ధావన్, అంబటి రాయుడు,ఎంఎస్. ధోని, కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌,జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ షమీ.
 

Follow Us:
Download App:
  • android
  • ios