Asianet News TeluguAsianet News Telugu

చెలరేగిన మాక్స్ వెల్: భారత్ ఓటమి, టీ20 సిరీస్ ఆసీస్ వశం

రెండు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ ఆస్ట్రేలియా కైవసలం చేసుకుంది. బెంగళూరులో బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మాక్స్ వెల్ అద్భుతమైన సెంచరీతో ఆసీస్ కు రెండో మ్యాచులో విజయం సాధించి పెట్టాడు.  
 

bangalore t20 updates
Author
Bangalore, First Published Feb 27, 2019, 7:25 PM IST

బెంగళూరులో బుధవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచును కూడా ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల టీ20 సిరీస్ ను గెలుచుకుంది. సొంత గడ్డపై భారత్ ఓటమి చవి చూసింది. మాక్స్ వెల్ 55 బంతుల్లో 9 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు పీటర్ హ్యాండ్స్ కోంబ్ 20 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. భారత బౌలర్లలో విజయ్ శంకర్ 2 వికెట్లు తీయగా, కౌల్ కు 1 వికెట్ లభించింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 

బెంగళూరులో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో ఆస్ట్రేలియా 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు పడలేదు. శంకర్ బౌలింగులో 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్స్ అవుటయ్యాడు. మాక్స్ వెల్  50 బంతుల్లో 8 సిక్స్ లు, 6 ఫోర్లతో వంద పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సిద్దర్థ్ కౌల్ బౌలింగ్ లో ఆసిస్ ఓపెనర్ స్టోయినీస్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ ఫించ్ రూపంలో ఆ వికెట్ కోల్పోయింది. ఫించ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ శంకర్ బౌలింగులో అవుటయ్యాడు.

బెంగళూరు టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ భారీ షాట్లతోమ చెలరేగి ఆసిస్ బౌలర్లను కంగారెత్తించినా ఫలితం లేకుండా పోయింది.. కోహ్లీ 6 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో కేవలం 38 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా మాజీ కెప్టెన్ ధోని కూడా 23 బంతుల్లో 40 పరుగులతో చెలరేగి ఆడటంతో టీమిండియా ఆసిస్ ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచింది.  ధనా ధన్ షాట్లతో అదరగొట్టిన ధోని 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరి ఓవర్లో ఔటయ్యాడు. 

టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు బెంగళూరు టీ20 లో అదరగొడుతున్నారు.ఈ క్రమంలో వేగంగా ఆడిన కోహ్లీ కేవలం 28 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.   బెంగళూరు టీ20 మ్యాచ్ లో ఆరంభంలో అదరగొట్టిన  టీమిండియా ఆ తర్వాత మధ్యలో తడబడింది. ఓపెనర్లిద్దరు వెంటవెంటనే వికెట్లు కోల్పోగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కూడా వారి బాటలోనే నడిచాడు. దీంతో భారత్ 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

బెంగళూరు టీ20లో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లె కోల్పోయింది. మొదట లోకేశ్ 61 పరుగుల వద్ద ఔటవగా మరో ఓపెనర్ ధావన్ 70 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో వికెట్లేవీ కోల్పోకుండానే హాఫ్ సెంచరీ మార్కుని దాటిన భారత స్కోరు 70కి చేరేసరికి రెండు వికెట్లు చేజారాయి. 

చెలరేగి బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీకి చేరువైన భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఔటయ్యాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడు. టాస్ గెలిచిన పర్యటక జట్టు ఆసిసి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య భారత్ బ్యాటింగ్ చేపట్టింది.  

విశాఖ టీ20లో పరాజయం తర్వాత జరుగుతున్న నిర్ణయాత్మక బెంగళూరు టీ20 లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ, యువ బౌలర్ మార్కండే తో పాటు విశాఖ వన్డేలో చివరి ఓవర్లో 14 పరుగులు సమర్పించుకుని భారత్ ఓటమికి కారణమైన ఉమేష్ యాదవ్ రెండో టీ20 కి దూరమయ్యారు. వారి స్థానంలో ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్, బౌలర్ సిద్దార్థ్ కౌల్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios