Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్: ధావన్ సెంచరీతో ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్

ఆసీస్‌తో మ్యాచ్‌లో ధావన్‌ సెంచరీతో మెరిశాడు. 109 బంతులు ఎదుర్కొన్న ధావన్‌ 16 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో భారత్‌(27 సెంచరీలు) తొలి స్థానానికి చేరింది. 

Team India breaks Austrlia record
Author
London, First Published Jun 9, 2019, 7:48 PM IST

లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు స్థాపించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ సెంచరీ సాధించాడు. దీంతో ప్రపంచ కప్ పోటీల్లో భారత్‌ 27వ సెంచరీని నమోదు చేసుకుంది. దాంతో ఆసీస్‌ను వెనక్కు నెట్టి భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. 

ఆసీస్‌తో మ్యాచ్‌లో ధావన్‌ సెంచరీతో మెరిశాడు. 109 బంతులు ఎదుర్కొన్న ధావన్‌ 16 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్ల జాబితాలో భారత్‌(27 సెంచరీలు) తొలి స్థానానికి చేరింది. 

ఆస్ట్రేలియా 26 సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక(23), వెస్టిండీస్‌(17), న్యూజిలాండ్‌(15)లు తర్వాత వరుస స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌(14 సెంచరీలు)లు సమాన స్థానంలో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios