Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: షకిబుల్ సెంచరీ వృధా...బంగ్లాపై ఇంగ్లాండ్ ఘన విజయం

పాకిస్థాన్  చేతిలో  ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్ మళ్లీ గెలుపుబాటలోకి వచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఆ  తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించి  ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బంగ్లా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించినా  సాధించాల్నిన రన్ రేట్ మరీ ఎక్కవగా వుండటంతో ఓటమిని  అంగీకరించక తప్పలేదు. బంగ్లా ఆల్ రౌండర్ షకీబల్ హసన్ అద్భుతమైన సెంచరీ(121 పరుగులు 119 బంతుల్లో) తో ఆకట్టుకున్నా తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

world cup 2019: england vs bangladesh match updates
Author
Cardiff, First Published Jun 8, 2019, 3:01 PM IST

పాకిస్థాన్  చేతిలో  ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్ మళ్లీ గెలుపుబాటలోకి వచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఆ  తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించి  ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బంగ్లా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించినా  సాధించాల్నిన రన్ రేట్ మరీ ఎక్కవగా వుండటంతో ఓటమిని  అంగీకరించక తప్పలేదు. బంగ్లా ఆల్ రౌండర్ షకీబల్ హసన్ అద్భుతమైన సెంచరీ(121 పరుగులు 119 బంతుల్లో) తో ఆకట్టుకున్నా తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ కేవలం 2 పరుగులు  మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్చర్ బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బంగ్లా కేవలం 8 పరుగుల వద్దే  మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆల్ రౌండర్ షకిబల్ హసన్ సెంచరీ(121 పరుగులు 119 బంతుల్లో) ఆకట్టుకున్నా కీలక సమయంలో అతడు ఔటవడంతో మళ్ళీ బంగ్లాకు కష్టాలు మొదలయ్యాయి. అంతకు ముందు రహీమ్ కూడా  44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే  భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వుండటంతో బంగ్లా బ్యాట్ మెన్స్ ఒత్తిడికి గురై వెంటవెంటనే వికెట్లు  కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.

అయితే టాస్ ఓడటంతో ముందు బ్యాటింగ్ కు  దిగిన ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ బంగ్లాదేశ్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్లు జాసన్ రాయ్(150 పరుగులు 121 బంతుల్లో), బెయిర్ స్టో  (51 పరుగులు) సెంచరీ భాగస్వామ్యాన్ని(128 పరుగులు)  నెలకొల్పి మంచి పునాది వేశారు. ఈ క్రమంలోనే రాయ్ సెంచరీని పూర్తి చేసుకోగా బెయిర్ స్టో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ఇలా శుబారంభం లభించడంతో తర్వాత వచ్చిన బ్యాట్ మెన్స్ బట్లర్ 64, మోర్గాన్ 35 పరుగులతో ఒత్తిడి లేకుండా ఆడగలిగారు. ఇక చివర్లో ఫ్లంకెట్ ( 9 బంతుల్లో 27), వోక్స్ (8 బంతుల్లో 18 పరుగులు) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 2, సైఫుద్దిన్ 2, మోర్తజా, రహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ఈ మ్యాచ్ లో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి తయారయ్యింది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఆ జట్టు బౌలర్లు విజృంభిస్తూ ఇంగ్లాండ్  బ్యాట్ మెన్స్ ను ఔట్ చేస్తున్నారు. ఇలా బట్లర్, మోర్గాన్, స్టోక్స్ లను వెంటవెంటనే ఔటయ్యారు. అయితే ఇంగ్లాండ్ స్కోర్ ఇప్పటికే 347 వద్ద వుండగా మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. 

 ఐసిసి ప్రపంచ  కప్ లో ఆసక్తికరమైన పోరుకు కార్డిఫ్ స్టేడియం సిద్దమయ్యింది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఉపఖండానికి చెందిన బంగ్లాదేశ్ తో తలపడి సొంత అభిమమానుల ముందు భారీ విజయాన్ని అందుకుంది.   

ఈ ప్రపంచ కప్ లో హాట్  ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు అనూహ్యంగా పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాపై గెలిచి మళ్లీ  విజయాలబాట పట్టాలని భావించిన ఇంగ్లీష్ జట్టు అందుకు తగ్గట్లుగానే అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది.  బంగ్లా విషయానికి వస్తే దక్షిణాఫ్రికా  వంటి బలమైన జట్టును ఓడించినా ఇంగ్లాండ్ ముందు ఆ పప్పులు ఉడకలేవు.   

బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. చివరి మ్యాచ్ ఆడిన ఆటగాళ్లందరు ఈ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఇంగ్లాండ్ జట్టులో మాత్రం ఓ మార్పు  చోటుచేసుకుంది. మోయిన్ అలీ స్థానంలో ఫ్లంకెట్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ మోర్గాన్ వెల్లడించాడు. 
 

తుది జట్లు:

ఇంగ్లాండ్ టీం: 

జాసన్ రాయ్, బెయిర్ స్టో, రూట్,  ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్,  జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, ఫ్లంకెట్,, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్
 
బంగ్లా  టీం: 

తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్,,  షకిబుల్ హసన్,  ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, ముసద్దిక్ హుస్సెన్,  మహ్మద్ సైఫుద్దిన్, మెహిదీ హసన్, మోర్తజా,మస్తాఫిజుర్ రహ్మాన్

Follow Us:
Download App:
  • android
  • ios