Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: రసవత్తర పోరులో పాక్‌దే విజయం...రూట్, బట్లర్ సెంచరీలు వృధా

ప్రపంచ కప్ లో పాక్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. విండీస్ చేతిలో ఘోర ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ కసితో ఆడి ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించింది. చివరివరకు రసవత్తంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు పాక్ దే పైచేయిగా నిలచింది. 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.. దీంతో పాక్ 14 పరుగులతో ఈ ప్రపంచ కప్ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.  

icc world cup 2019: england vs pakistan match updates
Author
Nottingham, First Published Jun 3, 2019, 3:00 PM IST

ప్రపంచ కప్ లో పాక్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. విండీస్ చేతిలో ఘోర ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ కసితో ఆడి ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించింది. చివరివరకు రసవత్తంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు పాక్ దే పైచేయిగా నిలచింది. 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.. దీంతో పాక్ 14 పరుగులతో ఈ ప్రపంచ కప్ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.   

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్  బౌలర్లను ఎదుర్కొన పాక్ టాప్ ఆర్డర్ మొత్తం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఇమామ్ 44, ఫకార్ జమాన్ 36 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ 63, కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ 55, హఫీజ్ 84 పరుగులతో రాణించడంతో పాక్ 348 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

అయితే ఈ స్కోరు కాపాడుకోవడంతో పాక్ బౌలర్లు కూడా సఫలమయ్యారు. భారీ లక్ష్య ఛేదనకు  దిగిన ఇంగ్లాండ్ ను ఆరంభంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న పాక్ బౌలర్లు మధ్యలో గాడి తప్పారు. దీంతో రూట్ 107, బట్లర్ 103 సెంచరీలతో చెలరేగి లక్ష్యఛేదన దిశగా జట్టును నడిపించారు. అయితే చివర్లో మళ్లీ పాక్ బౌలర్లు మాయ చేసి వెంటవెంటనే వికెట్లు పడగొడుతూ పాక్ ను  విజయతీరాలకు చేర్చారు. 

చివర్లో పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ అద్భుతం చేశాడు. కీలకమైన సమయంలో క్రీజులో కుదురుకున్న మోయిన్ అలీ, వోక్స్ లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఇదే మ్యాచ్ ను  పాక్ హస్తగతం చేసుకుంది. అంతకు ముందు కూడా మహ్మద్ అమీర్ కీలక మసయంలో సెంచరీతో చెలరేగి ఆడుతున్న బట్లన్ ఔట్ చేశాడు. ఇలా మిగతా పాక్ బౌలర్లు కూడా ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ ను సమర్థవంతంగా అడ్డుకుని జట్టును గెలిపించుకున్నారు.

పాక్ బౌలర్లలో సాదన్ ఖాన్ 2, మహ్మద్ అమీర్ 2, వాహబ్ రియాజ్ 3, హఫీజ్, మాలిక్ చెరో  వికెట్ పడగొట్టారు.అంతకు ముందు ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3, మోయిన్ అలీ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.  

 భారీ ఓటమితో ప్రపంచ కప్ టోర్నీని ఆరంభించిన పాక్ రెండో మ్యాచ్ లో మాత్రం కసితో ఆడింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ టాప్ ఆర్డన్ సమిష్టిగా రాణించడంతో 348 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.  ఇన్నింగ్స్ చివర్లో పాక్ బ్యాట్ మెన్స్ కాస్త తడబడ్డా భారీ స్కోరునే సాాధించగలిగారు. 

 వరల్డ్ కప్ 2019 మెగాటోర్నీలో మరో రసవత్తర పోరుకు నాటింగ్ హామ్ వేదికన జరిగింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆతిథ్య ఇంగ్లాండ్...విండీస్ చేతితో మరింత చిత్తుగా ఓడిన పాక్ లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. ఇలా ఓ జట్టు గెలుపు ఉత్సాహంతో మరోజట్టు కసితో బరిలోకి దిగగా మ్యాచ్ ఫలితం తారుమారయ్యింది. ఇంతకు ముందు భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోగా...ఓటమిపాలైన పాక్ అద్భుత విజయాన్ని  అందుకుంది.  

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ మరోసారి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.  అయితే ఈ ప్రపంచ కప్ కు కొద్దిరోజుల ముందే జరిగిన వన్డే సీరిస్ లో పాక్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ సీరిస్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్-పాక్ లు మళ్లీ  ఇలా ప్రపంచ కప్ లో తలపడ్డాయి.  

తుది జట్లు                                                                                                                                                    

 పాకిస్థాన్  టీం:                                                                        

ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్, వికెట్ కీపర్), షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదన్ ఖాన్, హసన్ అలీ, వాహబ్ రియాజ్.మహ్మద్ అమీర్

ఇంగ్లాండ్ టీం:

జాసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, రూట్,ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్, బట్లర్, మోయిన్  అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్,  మార్క్ వుడ్  

 

Follow Us:
Download App:
  • android
  • ios