Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ చీఫ్ గా గంగూలీ... న్యూ టీంతో దాదా ఫోటో వైరల్

ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌లోని 8 స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా అందరూ ఎన్నిక కావడం విశేషం. 

Sourav Ganguly Shares Photo With "New Team At BCCI", Thanks Anurag Thakur
Author
Hyderabad, First Published Oct 15, 2019, 1:08 PM IST


భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  సుప్రీం కోర్టు ఆదేశాలతో 2017లో అనురాగ్ ఠాకూర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక 33 నెలల క్రికెట్ పరిపాలన కమిటీ పాలన అనంతరం బీసీసీఐ పగ్గాలు దాదా చేతికి చిక్కనున్నాయి.

ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌లోని 8 స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా అందరూ ఎన్నిక కావడం విశేషం. అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న అందరూ అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

 

ఈ నేపథ్యంలో గంగూలీ ఓ ఫోటోని సోషల్ మీడియాలో  షేర్ చేశారు. బీసీసీఐ కొత్త టీం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఫోటోలో  గంగూలీతోపాటు అనురాగ్ ఠాకూర్, జై షా, అరుణ్ ధామల్, జయేశ్ జార్జ్ లు ఉన్నారు. తామంతా కలిసి మంచిగా పనిచేస్తామని తాను నమ్ముతున్నానంటూ గంగూలీ పేర్కొన్నారు. అనంతరం అనురాగ్ ఠాకూర్ ని ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు. 

 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా బిసిసిఐ కార్యదర్శిగా ఎన్నికవుతున్నారు. అరుణ్ ధమాల్ బిసిసిఐ కొత్త కోశాధికారిగా ఎన్నికవుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన 47 గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ కూడా పోటీ చేయడానికి ప్రయత్నించారు. బ్రిజేష్ పటేల్ ను ఎన్. శ్రీనివాసన్ ను బలపరిచారు. అయితే, బ్రిజేష్ పటేల్ అభ్యర్థిత్వానికి సరైన మద్దతు లభించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios