అతడో వరల్డ్ క్లాస్ బౌలర్...ముంబై గెలుపులో ముఖ్య పాత్ర: యువరాజ్ తో సచిన్ (వీడియో)
హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపిఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ వంటి సక్సెస్‌ఫుల్ జట్టును మట్టికరిపించి ముంబై జట్టు ట్రోఫిని ముద్దాడింది. ఇలా ఐపిఎల్ చరిత్రలో నాలుగోసారి విజేతగా నిలిచిన ముంబైపై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 149 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న ముంబై బౌలర్లను సచిన్ ప్రత్యేకంగా అభినందించాడు.

చెన్నై బ్యాటింగ్ విజయంవైపు వడివడిగా సాగుతున్న సమయంలో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా అదరగొట్టాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ని బెంబేలెత్తిస్తూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా క్రీజులో కుదురుకుని బ్యాట్ ను ఝలిపించడానికి సిద్దమైన బ్రావో ను ఓ అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించాడు. ఇలా బుమ్రా వేసిన 19వ ఓవరే చెన్నై విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పాలి. అంతకుముందు కూడా అంబటిరాయుడు వికెట్ ను పడగొట్టిన బుమ్రా మొత్తంగా ఈ మ్యాచ్ లో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ముంబై విజయం అనంతరం మైదానంలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ సరదాగా బుమ్రా గురించి మాట్లాడుకున్నారు. ఐపిఎల్ 2019 ఫైనల్లో కీలకమైన సమయంలో బుమ్రా మ్యాచ్ ను మలుపుతిప్పాడని సచిన్ పేర్కొన్నాడు. అతడిలాంటి పేస్ బౌలర్ టీమిండియా జట్టులోనే కాదు ప్రపంచంలోని మరే క్రికెట్ జట్లలో లేరంటూ ఆకాశానికెత్తేశాడు. బుమ్రాను ప్రపంచ స్థాయి మేటి బౌలర్ అంటూ సచిన్ అభినందించాడు.
యువరాజ్ కూడా బుమ్రా బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడాడు. అతడి బౌలింగ్ చేసే విధానం విభిన్నంగా వుంటుందని...అందువల్లే అతడు ఎక్కడ బంతులు వేస్తాడో ముందుగా ఊహించలేమన్నాడు. తన కెరీర్లో గుర్తిండిపోయే విధంగా బుమ్రా ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేశాడని యువరాజ్ ప్రశంసించాడు.