Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ బర్త్‌డే స్పెషల్: సెహ్వాగ్ చమత్కారం, బిసిసిఐ సత్కారం... ఎవరెలా విష్ చేశారంటే

రోహిత్ శర్మ... పేరులోనే కాదు ఇతని ఆటలోనూ హిట్టింగ్ వుంటుంది. అందువల్లే అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్ చరిత్రనే తిరగరాస్తూ వన్డేల్లో ఓ జట్టుమొత్తం కలిసి సాధించే స్కోరు(264) ను ఒక్కడే బాదాడంటే అతడి హిట్టింగ్ ఏ రేంజ్ లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐపిఎల్ లో అయితే ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ కు మరో మెట్టెక్కి ముంబై ఇండియన్స్ కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ఇలా ఐపిఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కూడా మారాడు.   
 
rohit sharma birthday special stories
Author
Mumbai, First Published Apr 30, 2019, 8:08 PM IST

రోహిత్ శర్మ... పేరులోనే కాదు ఇతని ఆటలోనూ హిట్టింగ్ వుంటుంది. అందువల్లే అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్ చరిత్రనే తిరగరాస్తూ వన్డేల్లో ఓ జట్టుమొత్తం కలిసి సాధించే స్కోరు(264) ను ఒక్కడే బాదాడంటే అతడి హిట్టింగ్ ఏ రేంజ్ లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐపిఎల్ లో అయితే ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ కు మరో మెట్టెక్కి ముంబై ఇండియన్స్ కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ఇలా ఐపిఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కూడా మారాడు.   

అలాంటి హర్డ్ హిట్టర్, కెప్టెన్ గా మంచి ఫామ్ లో వున్న రోహిత్ ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి ఐసిసి, బిసిసిఐ తో పాటు సహచరులు, మాజీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులయితే ట్విట్టర్, పేస్ బుక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రోహిత్ పై తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. 

ఇలా రోహిత్ కు ఎవరెవరు ఎలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారో ఓసారి చూద్దాం.

ఐపిఎల్:

''రోహిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు...అతడి మరో  ఏడాది పెద్దవాడివైపోయాడు. ఈ సందర్భంగా 2012 ఐపిఎల్ లో అతడికి ఇష్టమైన ఈడెన్ గార్డెన్ లో బాదిన 109 పరుగుల అజేయ సెంచరీ సాధించిన అనందాన్ని మరోసారి చూడండి'' అంటూ ట్వీట్ చేసింది. 

బిసిసిఐ: 

''పుట్టినరోజు శుభాకాంక్షలు హిట్ మ్యాన్...మా చాంఫియన్ 32 ఏడాదిలోకి ఇవాళ అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా వన్డే క్రికెట్ లోనే చరిత్రను సృష్టించిన అతడి 264 పరుగుల ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకుంటున్నాం. '' అంటూ ప్రశంసతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఐసిసి: 

''హ్యాపీ భర్త్‌డే ఇండిన్ ఓపెనర్ రోహిత్...అతడు మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించాడు. అలాగే వన్డేల్లో ఏ ఆటగాడికి సాధ్యం కానివిధంగా 264 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్నాడు. అయితే అతడు ఈ ప్రపంచ కప్ టోర్నీలో మరో డబుల్ సెంచరీని సాధిస్తాడా? '' అన్న ప్రశ్నతో తన ట్వీట్ ను ఎండ్ చేసింది. 

వీరేంద్ర సెహ్వాగ్: 

మాజీ టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కాస్త చమత్కారాన్ని జోడించి రోహిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '' హిట్ వుండేది...హిట్ వుంది...హిట్ ఎప్పటికీ వుంటుంది...దేశ హితం కోసం...హ్యాపీ భర్త్‌డే రోహిత్'' అంటూ సెహ్వాగ్ ట్వీట్టర్ ద్వారా విషెస్ తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios