Asianet News TeluguAsianet News Telugu

రాంచి టెస్ట్: 497/9 వద్ద భారత్ డిక్లేర్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన సఫారీలు

రాంచి టెస్టులో భారత్ ఏడో  వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. కొద్దీ సేపటికే రవీంద్ర జడేజా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక వెంటనే క్లాస్సేన్ అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ వికెట్ ను కూడా లిండే నే అందుకోవడం విశేషం. 

ranchi test: jaddu out after scoring half century, india looses its seventh wicket
Author
Ranchi, First Published Oct 20, 2019, 2:29 PM IST

భారత్ డిక్లేర్ చేసింది.. జడేజా ఔట్ అయిన వెంటనే చివరి వరుస బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరుతుండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 116.3 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది.

రోహిత్ 212, రహానే 115, జడేజా 51 పరుగులతో వీరవిహారం చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే 4, రబాడా 3, ఎన్రిచ్, పీట్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షమీ బౌలింగ్‌లో ఓపెన్ ఎల్గర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డికాక్, హమ్జా క్రీజులో ఉన్నారు. 

భారత్ ఏడో  వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. కొద్దీ సేపటికే రవీంద్ర జడేజా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక వెంటనే క్లాస్సేన్ అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ వికెట్ ను కూడా లిండే నే అందుకోవడం విశేషం. 

రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబాడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు భారత స్కోర్ 370 పరుగులు. రోహిత్ వెనుదిరిగిన తరువాత సహా బాటింగ్ కు వచ్చాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు.ప్రస్తుత భారత స్కోర్ 379/5.  

రోహిత్ శర్మ  డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 199 పరుగుల వద్ద సిక్స్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాంచి టెస్టులో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోయాడు. టెస్టు మ్యాచులో 80 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇదే తొలి డబల్ సెంచరీ. 

నిన్నటి నుంచి జోరు మీదున్న హిట్ మ్యాన్ ఈ రోజు ఆ జోరును మరింత పెంచాడు. టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. ఇందాకే రహానే ఔటయ్యాడు.   అజింక్య రహానే 115 పరుగుల వద్ద జార్జ్ లిండే బౌలింగ్ లో క్లాస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్రజడేజా(17),సహా (6) క్రీజులో ఉన్నారు. 

ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద భారత్ తన ఆటను ఆరంభించింది. నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ డబల్ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరద పారించాడు.  సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ.

Follow Us:
Download App:
  • android
  • ios