Asianet News TeluguAsianet News Telugu

ప్రమాదకరమైన వ్యక్తుల జాబితాలో ధోనీ, సన్నీలియోన్

సాధారణంగా సెలబ్రెటీల గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు అభిమానులు తాపత్రయపడుతుంటారు. ఈ క్రమంలో వారి గురించి ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ధోనీ, సన్నిలియోన్ లాంటి వారి కోసం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్ సైట్ల లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలబ్రెటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఆ సంస్థ ఓ నివేదిక తయారు చేసింది.
 

MS Dhoni is the riskiest celebrity to search for online: McAfee
Author
Hyderabad, First Published Oct 23, 2019, 12:50 PM IST

బాలీవుడ్ అందాల తార సన్నీలియోన్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉండి ఉంటారు. వారు చేసే ప్రతి పనిని గమనిస్తూ... వారిని అనుసరిస్తూ... ఆరాధించేవారు లక్షల్లో ఉంటారు. అలాంటి ఈ వ్యక్తులు చాలా ప్రమాధకరమైన వారట. వీళ్లిద్దరే కాదు... హీరోయిన్ రాధిక ఆప్టే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులని ఓ సంస్థ తెలిపింది. 

అంత ప్రమాదం వీళ్లు ఏం చేశారా అని అనుకుంటున్నారా...? నిజానికి వీళ్లేమీ చేయలేదు. కానీ... వాళ్లపై అభిమానులకు ఉన్న ప్రేమను కొందరు స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రముఖులను టార్గెట్ చేసుకొని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.... సాధారణంగా సెలబ్రెటీల గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు అభిమానులు తాపత్రయపడుతుంటారు. ఈ క్రమంలో వారి గురించి ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ధోనీ, సన్నిలియోన్ లాంటి వారి కోసం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్ సైట్ల లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలబ్రెటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఆ సంస్థ ఓ నివేదిక తయారు చేసింది.

అందులో రాధికా ఆప్టే, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీవీ ఆర్టీస్ట్, హిందీ బిగ్ బాస్ విన్నర్ గౌతమ్ గులాటీ లాంటి వారు ఉన్నారు. వీళ్లందరిలో ధోనీ, సచిన్ ముందు వరసలో ఉండటం గమనార్హం. సన్నీలియోన్ నాలుగో స్థానంలో ఉండగా... గౌతమ్ గులాటీ మూడో స్థానంలో ఉన్నారు. 

ఎక్కువగా ఎవరికోసం సెలబ్రెటీలు సెర్చ్ చేస్తుంటారో వారిని టార్గెట్ చేసి  వాళ్ల సమాచారం కోసం వెతికే సమయంలో మాలీసియస్ వెబ్ సైట్ల సమాచారాన్ని పెడుతున్నట్లు వారి సర్వేలో తేలింది. కాగా... సెలబ్రెటీల గురించి ఏ సమాచారం తెలుసుకోవాలని అన్నా కూడా...అధికారిక వెబ్ సైట్ల నుంచి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios