Asianet News TeluguAsianet News Telugu

మైదానంలోకి దూసుకొచ్చిన ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

ధోనీ తీరుపై సెహ్వాగ్ చురకలు అంటించారు. అంత కోపం ఇండియా టీమ్ కోసం వస్తే తనకు చాలా సంతోషంగా ఉండేదని, కానీ ఇప్పటివరకూ అతను ఇండియా కోసం అంత అగ్రహం వ్యక్తం చేయడం తాను చూడలేదని అన్నాడు.

IPL 2019: Sehwag comments on MS Dhoni
Author
Delhi, First Published Apr 13, 2019, 8:53 PM IST

ఐపిఎల్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి దూసుకు రావడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆయన ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జరిమానా విధించి ధోనీని వదిలేశారు. ధోనీ తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ తీరుపై సెహ్వాగ్ చురకలు అంటించారు. అంత కోపం ఇండియా టీమ్ కోసం వస్తే తనకు చాలా సంతోషంగా ఉండేదని, కానీ ఇప్పటివరకూ అతను ఇండియా కోసం అంత అగ్రహం వ్యక్తం చేయడం తాను చూడలేదని అన్నాడు. కానీ చెన్నై కోసం అతను చాలా ఉద్వేగానికి గురయ్యాడని అన్నాడు. 

ధోనీ గ్రౌండ్‌లోకి రావాల్సిన అవరసం ఉందని తాను అనుకోవడం లేదని సెహ్వాగ్ అన్నాడు అక్కడ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఉన్నారని, వాళ్లు నోబాల్ గురించి అంపైర్‌ని ప్రశ్నిస్తున్నారని, కాబట్టి ధోనీ గ్రౌండ్‌లోకి రావాల్సిన అవసరం లేదని అన్నాడు. 

జరిమానా విధించడం చాలా చిన్న శిక్ష అని కూడా అభిప్రాయపడ్డారు. కనీసం ధోనీని ఒకటో, రెండో మ్యాచులు నిషేధించాల్సిందని అన్నాడు. ఎందుకంటే ఇది చూసి భవిష్యత్తులో మరెవరైనా కెప్టెన్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగే అవకాశం ఉందని అన్నాడు. అందుకే ధోనీని కనీసం రెండు మ్యాచులైనా నిషేధిస్తే.. అది ఇతరులకు హెచ్చరికలా ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ ధోనీ మైదానంలోకి దూసుకొచ్చి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే అతడి చర్యపై ఓ మ్యాచ్‌ నిషేధం ఉంటుందని భావించినా కేవలం 50 శాతం జరిమానాతో వదిలేశారు. స్టోక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాలుగో బంతి ఆటగాడి నడుముపైకి రావడంతో ముందుగా ఫీల్డ్‌ అంపైర్‌ ఉల్హాస్‌ గంధే నోబాల్‌గా ప్రకటించాడు. 

అయితే లెగ్‌ అంపైర్‌ బ్రూస్‌ ఆక్సెన్‌ఫోర్డ్‌ మాత్రం దీన్ని తిరస్కరించడంతో గంధే తన నిర్ణయానికి వెనక్కి తీసుకున్నాడు. ఇదంతా డగౌట్‌ నుంచి చూస్తున్న ధోనీ ఆగ్రహంతో నేరుగా మైదానంలోకొచ్చి వాదనకు దిగాడు. ఇలా చేయడం ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి లెవల్‌ 2 నిబంధనను అతిక్రమించడమేనని, ఇందుకుగాను ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. 

ఐసీసీ రూల్స్‌ ప్రకారం అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గరిష్ఠంగా ఓ టెస్టు, రెండు వన్డేల నిషేధం విధించవచ్చు. అయితే ధోనీకి కేవలం జరిమానా మాత్రం విధించడంపై కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

ధోనీ కూడా మనిషే కదా.. గంగూలీ మద్దతు

క్లారిటీ కోసమే గ్రౌండ్‌లోకి: అంపైర్లతో ధోని గొడవపై కోచ్ స్పందన

‘నోబాల్’ తెచ్చిన తంటా, అంపైర్లతో వాగ్వాదం: ధోనికి జరిమానా

Follow Us:
Download App:
  • android
  • ios