Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019 ట్రోఫి ముంబై ఇండియన్స్‌దే...పోరాడి ఓడిన చెన్నై

ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య సాగిన టైటిల్ పోరులో చివరకు ముంబైదే పైచేయిగా నిలిచింది. 150 పరుగుల లక్ష్యానికి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచి సీఎస్కే ఐపిఎల్ ట్రోఫిని చేజార్చుకుంది.   

ipl 2019 final match: chennai super king vs mumbai indians match updates
Author
Hyderabad, First Published May 12, 2019, 7:32 PM IST

ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య సాగిన టైటిల్ పోరులో చివరకు ముంబైదే పైచేయిగా నిలిచింది. 150 పరుగుల లక్ష్యానికి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచి సీఎస్కే ఐపిఎల్ ట్రోఫిని చేజార్చుకుంది.  

చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ విరోచితంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ముంబై బౌలర్ లసిత మలింగ చివరి ఓవర్లో మాయ చేశాడు. చెన్నై విజయాన్ని 6 బంతుల్లో 9 పరుగులు అవసరమైన సమయంలో వాట్సన్, శార్దూల్ ఠాకూర్ ల వికెట్లు పడగొట్టిన మలింగ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ముంబై ఇండియన్స్  కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.  

బౌలర్ బుమ్రా కూడా డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేసి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 19 ఓవర్లో పొదుపుగా బౌలింగ్  చేసి అతడు బ్రావో వికెట్ పడగొట్టాడు. దీంతో  ముంబై  గెలుపుపై ఆశలను సజీవంగా వుంచుకోగలిగింది. ఆ తర్వాత మలింగ మిగతా పనిని కానిచ్చి ముంబై ఇండియన్స్ ని నాలుగోసారి ఐపిఎల్ విజేతగా నిలిపాడు. 

అయితే చెన్నై గెలుపు కోసం ఓపెనర్ షేన్ వాట్సన్( 80 పరుగులు 59  బంతుల్లో) వీరోచితంగా పోరాడాడు. మిగతా బ్యాట్ మెన్స్ ఎవ్వరూ సహకరించకున్నా ఒంటరిగానే స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. చివర్లో బ్రావో అతడికి కాస్త సహకారం అందించడంతో చెన్నై గెలుపు ఖాయంగానే కనిపించింది. కానీ  వారిద్దరు కొన్న బంతుల తేడాతోనే ఔటవడంతో ముంబై గెలుపు సాధ్యమయ్యింది.

ఈ మ్యాచ్ లో ధోని, రైనా, రాయుడు, డుప్లెసిస్ వంటి హేమాహేమీలు కూడా ముంబై బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయారు. బుమ్రా 2, రాహుల్ చాహర్1,మలింగ1. హార్దిక్ పాండ్యా1  వికెట్ పడగొట్టి చెన్నై ఓటమిని శాసించారు. 

 ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ముంబై బ్యాట్ మెన్స్ కూడా బ్యాటింగ్ లో తడబడ్డారు.  సీఎస్కే బౌలర్ల విజృంభణదతో ముంబై  విరామం లేకుండా వికెట్లు కోల్పోయింది. అయితే మొదట్లో ఓపెనర్ డికాక్(29 పరుగులు), చివర్లో పొలార్డ్ (41 పరుగులు 25 బంతుల్లో) మెరుపులు తోడవడంతో ముంబై 149 పరుగుల  గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ 3, తాహిర్ 2, ఠాకుర్ రెండు వికెట్లు పడగొట్టారు.

 గత రెండు నెలలుగా  అభిమానులకు క్రికెట్ మజాను పంచుతున్న ఐపిఎల్ సీజన్ 12 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్, క్వాలిఫయర్ దశల్లో అద్భుత విజయాలను అందుకున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ 2019 టైటిల్ పోరులో తలపడ్డాయి.  అయితే చివరకు చెన్నై పై గెలిచిన ముంబై ఐపిఎల్ 2019 ట్రోఫిని ఎగరేసుకు పోయింది.  

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ గెలుచుకున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ  బ్యాటింగ్ వైపు మొగ్గుచూపారు. దీంతో ధోని సేన ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. సమఉజ్జీల మధ్య జరుగిన పోరాటంలో నరాలు తెగే ఉత్కంఠ  మధ్య సాగింది.  

టాస్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ...ముందుగా  బ్యాటింగ్ చేసి భారీ పరుగులను  ప్రత్యర్థి ముందుచాలని ముందుగానే ప్రణాళికలు రచించినట్లు తెలిపారు.  అనుకున్నట్లే టాస్ గెలవడంతో మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. క్వాలిఫయర్ 1 తర్వాత ఐదు రోజుల పాటు విశ్రాంతి లభించడం తమకు కలిసొచ్చే అంశమని రోహిత్  వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో  జయంత్ యాదవ్ స్థానంలో మిచెల్ మెక్లెనగన్ బరిలోకి దిగనున్నట్లు రోహిత్ వెల్లడించాడు.

ముంబై టీం:

డికాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, మెక్లనగన్, రాహుల్ చాహర్, మలింగ, బుమ్రా

ధోని  మాట్లాడుతూ...తాము టాస్ గెలిచినా  ఫీల్డింగ్ ఎంచుకోవాలని  భావించినట్లు తెలిపాడు. లక్కీగా టాస్ గెలవకున్నా ముంబై ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంతో  తమకు కలిసొచ్చిందన్నాడు. ఈ  మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేపట్టలేదని ధోని వెల్లడించాడు. 

చెన్నై టీం:

షేన్ వాట్సన్, డుప్లెసిస్, రైనా, అంబటి రాయుడు, ధోని, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, షార్దూల్ ఠాకుర్ 

Follow Us:
Download App:
  • android
  • ios