Asianet News TeluguAsianet News Telugu

మేం ఫైనల్లోకి రావడానికి వారే కారణం: ధోనీ

వికెట్లు పడగొట్టడమే మ్యాచ్‌లో అత్యంత కీలకమని, కాబట్టి బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని ధోనీ శుక్రవారం మ్యాచ్ అనంతరం మీడియాతో అన్నాడు. తనకు ఏం కావాలన్నది కెప్టెన్‌ అడుగుతాడని, దాన్ని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అనేది నిర్ణయించుకుంటారని అన్నాడు. 

IPL 2019: Dhoni praises bowlers
Author
Visakhapatnam, First Published May 11, 2019, 10:16 AM IST

విశాఖపట్నం: తమ విజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు బౌలర్లను ప్రశంసించాడు. తాము ఫైనల్లోకి రావడానికి బౌలర్లే కారణమని ఆయన అన్నాడు.  ఎలిమినేటర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఐపిల్ ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే.ఈ సీజన్‌లో తమ జట్టు ఉత్తమ ప్రదర్శనకు, ఫైనల్‌కు చేరడానికి బౌలర్లే కారణమని ప్రశంసల జల్లు కురిపించారు.

వికెట్లు పడగొట్టడమే మ్యాచ్‌లో అత్యంత కీలకమని, కాబట్టి బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని ధోనీ శుక్రవారం మ్యాచ్ అనంతరం మీడియాతో అన్నాడు. తనకు ఏం కావాలన్నది కెప్టెన్‌ అడుగుతాడని, దాన్ని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అనేది నిర్ణయించుకుంటారని అన్నాడు. 

ఈ సీజన్‌లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకే బౌలర్లే కారణమని, తమ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు థాంక్స్‌ చెప్తున్నానని అన్నాడు. గత ఏడాది కన్నా భిన్నంగా ఈ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు వచ్చామని, గత మ్యాచ్‌లో పరుగుల విషయంలో, క్యాచ్‌ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయని అన్నాడు. 

కానీ గట్టిగా కమ్‌బ్యాక్‌ ఇచ్చామని అన్నాడు. 140కిపైగా పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించడం ఆనందంగా ఉందని, తమ బౌలర్ల కృషి కూడా చాలా బాగుందని అన్నాడు. ఢిల్లీని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగామని, వాళ్ల బ్యాటింగ్‌ చాలా బలంగా ఉందని, ఓపెనర్లను త్వరగా ఔట్‌ చేయడం చాలా ముఖ్యంగా భావించామని ధోనీ అన్నడాు.

ఢిల్లీలో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ చాలామంది ఉన్నారని, వారిని కట్టడి చేసేందుకు తమ వద్ద ఉన్న లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ను వాడామని, మైదానం చిన్నగా ఉండటంతో త్వరగా వికెట్లు రాబట్టడం కీలకంగా భావించామని అన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios