Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019: చేతులెత్తేసిన పంజాబ్, చెన్నై సూపర్ విక్టరీ

ఐపిఎల్ లో భాగంగా శనివారం జరుగుతున్న మ్యాచులో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. . 

IPL 2019: Chennai vs Punjab match updates
Author
Chennai, First Published Apr 6, 2019, 3:47 PM IST

చెన్నై: ఐపిఎల్ మ్యాచులో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 22 పరుగుల తేడాతో విజయం  సాధించింది. చెన్నై తమ ముందు ఉంచిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. కుగ్గెలీన్, హర్భజన్ రెండేసి వికెట్లు తీయగా, చాహర్ కు ఒక్క వికెట్ లభించింది. ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత పంజాబ్ బ్యాట్స్ మెన్ రాహుల్, సర్ఫరాజ్ నిలకడగా ఆడి అర్థ సెంచరీలు చేసినప్పటికీ రన్ రేటును సాధించలేకపోయారు. దీంతో పంజాబ్ ఓటమి పాలు కాక తప్పలేదు. 

చెన్నై సూపర్ కింగ్స్ పై రెండు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ పడింది. 24 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ 137 పరుగుల వద్ద ఔటయ్యాడు. పంజాబ్ 117 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ భారీ షాట్ కు వెళ్లి 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికి పంజాబ్ 15 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ పై కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 42 బంతుల్లో అతను అర్థ సెంచరీ చేశాడు. కెఎల్ రాహుల్ కూడా అర్థ సెంచరీ చేశాడు. అతను 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తమ ముందు ఉంచిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హర్బజన్ తన తొలి ఓవరులోనే ఈ రెండు వికెట్లు తీశాడు. క్రిస్ గేల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా, మాయాంక్ అగర్వాల్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై జరిగిన మ్యాచులో చివరలో కెప్టెన్ ధోనీ ధనాధన్ బ్యాటింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ 160 పరుగులు చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ధోనీ 23 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు 15 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 21 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. మూడు వికెట్లు కూడా పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కే పడ్డాయి.

పంజాబ్ పై మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 100 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్ 38 బంతుల్లో నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్ల సాయంతో 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ వెంటనే అదే స్కోరు వద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగుకు బోల్తా పడ్డాడు. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రైనా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పంజాబ్ పై మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. అయితే, 56 పరుగుల స్కోరు వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. షేన్ వాట్సన్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. ఐపిఎల్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై బ్యాటింగ్ ఎంచుకుంది. 

తుది జట్లు

పంజాబ్: కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మాయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మణదీప్ సింగ్, డేవిడ్ మిల్లర్, సామ్ కుర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఎం అశ్విన్, ఆండ్య్రూ టై, మొహమ్మద్ షమీ

చెన్నై: షేన్ వాట్సన్, ఫాప్ డూ ప్లెసిస్, అంబటి రాయుడు, సురేష్ రైనా, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, స్కాట్ కుగ్గెలీయన్, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

Follow Us:
Download App:
  • android
  • ios