Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి భారత ఆటగాళ్ల ప్రత్యేక అభినందనలు...ఎవరెలా చెప్పారంటే

రెండోసారి భారతీయ జనతా పార్టీని భారత ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే గత ఐదేళ్ల మోదీ పాలనకు రెపరెండంగా జరిగిన ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయన హవానే కొనసాగింది. దేశంలోని చాలా పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి ఆయన మరోసారి  ప్రధాని పీఠాన్ని  అధిరోహించకుండా అడ్డుకోవాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవి ఫలించకుండా మరోసారి  ఘన విజయాన్ని అందుకున్న బిజెపి, మోదీకి అన్ని వర్గాల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.  

indian cricketer congratulates modi
Author
New Delhi, First Published May 24, 2019, 8:56 PM IST

రెండోసారి భారతీయ జనతా పార్టీని భారత ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే గత ఐదేళ్ల మోదీ పాలనకు రెపరెండంగా జరిగిన ఈ ఎన్నికల్లో మళ్లీ ఆయన హవానే కొనసాగింది. దేశంలోని చాలా పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి ఆయన మరోసారి  ప్రధాని పీఠాన్ని  అధిరోహించకుండా అడ్డుకోవాలని అనుకున్నారు. ఆ ప్రయత్నాలేవి ఫలించకుండా మరోసారి  ఘన విజయాన్ని అందుకున్న బిజెపి, మోదీకి అన్ని వర్గాల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు మోదీకి శుభాకాంక్షలు. అలా ఎవరెవరు, ఎలా  మోదీకి అభింనందనలు తెలిపారో చూద్దాం.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ:

ప్రపంచ కప్ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ లో వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాని మోదీకి  ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు  తెలిపాడు. '' నరేంద్ర మేదీజి శుభాకాంక్షలు. మీ హయాంలో దేశం మరింత ఉన్నత స్థానంలోకి వెళుతుందని మేం నమ్ముతున్నాం. జై హింద్'' అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. 

 

వీరేంద్ర సెహ్వాగ్:

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపాడు. '' ఇండియా గెలిచింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఈ గెలుపు అవసరం. ఈ అద్భుత విజయాన్ని అందుకోవడానికి నాయకత్వం వహించిన నరేంద్ర మోదీకి అభినందనలు. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా సాగాలని...దేశ ప్రగతి కొనసాగుతూ గొప్ప ఎత్తులకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్'' అంటూ సెహ్వాగ్ క్రికెట్ బాషలో అభినందనలు తెలిపాడు. 

 
 సచిన్ టెండూల్కర్:

'' నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో యావత్ దేశం మీ వెంటే వుంటుంది'' అంటూ భారత క్రికెట్ దిగ్గజం, మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.  

 
టీమిండియా కోచ్ రవిశాస్త్రి:  

టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుతం జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి బిజెపి ఘన విజయంపై స్పదించారు. '' నరేంద్ర మోదీ, అమిత్ షాల సారథ్యంలో మరో అద్భుత విజయాన్ని  అందుకున్న బిజెపి కి అభినందనలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ మరోసారి మోదీ నాయకత్వాన్నే కోరుకున్నారు.  ఈ  ఎన్నికల్లో  ఆయన అద్భుత ప్రదర్శన చేశారు. '' అని రవిశాస్త్రి మోదీ,అమిత్ షాల సారథ్యంపై కామెంట్ చేశారు. 

 


 
   
 

Follow Us:
Download App:
  • android
  • ios