Asianet News TeluguAsianet News Telugu

ఉమేశ్ బౌన్సర్‌కు ఎల్గర్ విలవిల: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలిపోయిన ఆ జట్టు.. ఫాలో ఆన్‌లో సైతం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది

India vs South Africa, 3rd Test Live Cricket Score
Author
Ranchi, First Published Oct 21, 2019, 4:47 PM IST

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలిపోయిన ఆ జట్టు.. ఫాలో ఆన్‌లో సైతం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది.

భారత పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు చురకత్తుల్లాంటి బంతులను సంధిస్తుండటంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేతులేత్తేస్తున్నారు. మరోవైపు ఉమేశ్ వేసిన ఓ బంతి డీన్ ఎల్గర్ హెల్మెట్‌కు బలంగా తగలడంతో అతను క్రీజులోనే కుప్పకూలిపోయాడు.

Also Read: భారత్ పై నోరు పారేసుకున్న సఫారీ క్రికెటర్... గడ్డి పెడుతున్న ఫ్యాన్స్

భారత జట్టు ఆటగాళ్లతో పాటు దక్షిణాఫ్రికా ఫిజియో అతనిని పరిశీలించారు. కాంకషన్ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దీంతో అంపైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. అంతకుముందు షమీ వేసిన 8.3వ బంతికి బవుమా 0, డుప్లెసిస్ 4 పరుగులకే వెనుదిరిగారు. ఎల్బీగా దొరికిపోయిన డుప్లెసిస్‌కు రివ్యూలో సైతం అదృష్టం కలిసిరాలేదు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. డిబ్రెయిన్ 15, పీయడ్త్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో మూడో రోజు ఆటను కెప్టెన్ డుప్లెసిస్-హమ్జాలు ప్రారంభించారు.

అయితే సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంతో విఫలమైన డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. అనంతరం హమ్జా-బావుమాల జోడీ జట్టును ఆదుకుంది. ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే హమ్జా, బావుమాలు వెంట వెంటనే ఔటయ్యారు.

Also Read: కోహ్లీ క్యాన్ డిడ్ ఫోటో... గల్లీ బాయ్ చేసేసిన అభిమానులు

ఆ తర్వాత క్లెసెన్, పీయడ్త్, రబాడాలు చేతులేత్తేశారు. భోజన విరామం తర్వాత లిండే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అతనికి నోర్జే నుంచి చక్కని సహకారం లభించడంతో ఈ జంట సుమారు 18 ఓవర్ల పాటు క్రీజులో ఎట్టకేలకు లిండే, నోర్జేలను భారత్ ఔట్ చేయడంతో 56.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా కథ ముగిసింది.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ తొలిసారి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి వీర విహారం చేశాడు. అతనికి రహానె శతకం తోడవ్వడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో లిండే 4, రబాడ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios