Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా ఫస్ట్, స్మిత్ తర్వాతే కోహ్లీ: రోహిత్ శర్మ ఒక్కసారిగా...

దక్షిణాఫ్రికాపై సిరీస్ లో డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో ఒక్కసారిగా టాప్ 10లోకి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది.

ICC test rankings: Rohit Sharma in top 10, Kohli second place
Author
Mumbai, First Published Oct 23, 2019, 4:51 PM IST

ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఐసిసి ర్యాంకింగ్స్ లో ఒక్కసారిగా 12 స్థానాలు ఎగబాకాడు. తద్వారా టాప్ 10లో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టుకు ముందు రోహిత్ శర్మ 22వ స్థానంలో ఉన్నాడు. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ చేయడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది. 

రోహిత్ శర్మ 722 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. ఐసిసి అన్ని ఫార్మాట్లలో టాప్ 10లో నిలివడం ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మాట్లలోనూ టాప్ 10 స్థానాల్లో కొనసాగుతున్నాడు. 

బ్యాట్స్ మెన్ లలో స్టీవ్ స్మిత్ తర్వాతనే విరాట్ కోహ్లీ నిలిచాడు. స్టీవ్ స్మిత్ తొలి స్థానంలో నిలువగా, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన పూణే టెస్టులో డబుల్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ తన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నడాు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్ కు కోహ్లీకి మధ్య 11 పాయింట్ల తేడా ఉంది.

రాంచీ టెస్టులో సెంచరీ చేసిన వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే ఐదో స్థానానికి ఎకబాకాడు. మరో టీమిండియా బ్యాట్స్ మన్ ఛతేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ -10లో నలుగురు భారత క్రికెటర్లు ఉండడం విశేషం. 

బౌలర్ల ర్యాంకింగ్సులో పెద్గగా మార్పులు లేవు. గాయం కారణంగా టెస్టు సిరీస్ కు దూరమైన జస్ ప్రీత్ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. బుమ్రా మినహా భారత్ కు చెందిన ఓ బౌలర్ కూడా టాప్ 10లో స్థానం దక్కించుకోలేదు. రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు 14, 15 స్థానాల్లో నిలిచారు. ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలిచాడు. 

దక్షిణాఫ్రికా సిరీస్ ను వైట్ వాష్ చేయడంతో టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. 119 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వా త స్థానాల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా జట్లు కొనసాగుతున్నాయి.

టాప్ - 5 ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

బ్యాటింగ్: స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే
బౌలింగ్: ప్యాాట్ కమిన్స్, కగిసో రబడ, హోల్డర్, బుమ్రా, జేమ్స్ అండర్సన్
ఆల్ రౌండర్స్: హోల్డర్, రవీంద్ర జడేజా, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, ఫిలాండర్
జట్టు: టీమిండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

Follow Us:
Download App:
  • android
  • ios