Asianet News TeluguAsianet News Telugu

పిచ్ ఏదైనా కానీ డోంట్ కేర్, రోహిత్ డిఫరెంట్ క్లాస్: రవిశాస్త్రి

రోహిత్ శర్మను టీమిండియా హెడ్ కోచ్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాంచీ టెస్టు ముగిసి దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ షాబాజ్ నదీమ్ ను కూడా పొగిడాడు. నదీమ్ ను బిషన్ సింగ్ బేడీతో పోల్చాడు.

'To hell with the pitch', Ravi Shastri on Team India's mindset
Author
Ranchi, First Published Oct 22, 2019, 1:57 PM IST

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ చూపిన అనితర సాధ్యమైన ప్రతిభను టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. టెస్టు ఓపెనర్ గా లభించిన కొత్త పాత్రలో రోహిత్ శర్మ డిఫరెంట్ క్లాస్ ను ప్రదర్శించాడని ఆయన అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో సవాళ్లలను రోహిత్ శర్మ ఎదుర్కున్న తీరు విశిష్టమైందని అన్నాడు. 

తుది టెస్టు మ్యాచును ఇన్నింగ్స్ 202 పరుగులతో తేడాతో గెలుచుకుని దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ ను భారత జట్టు స్వీప్ చేసింది. అజింక్యా రహానే మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నాడని, తనకు లభించిన అవకాశాన్ని వాడుకున్నాడని రవిశాస్త్రి అన్నాడు. 

ఓపెనర్ గా డిఫరెంట్ మైండ్ సెట్ అవసరమని, దాన్ని రోహిత్ శర్మ సంతరించుకున్నాడని, పిచ్ ప్రారంభంలో అతి కష్టంగా ఉంటుందని, అయితే, రోహిత్ శర్మ దాన్ని అధిగమించాడని అన్నారు. మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత బిసిసిఐ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడాడు. 

 

అతి కష్టమైన కండీషన్లకు రోహిత్ భయపడలేదని, ఈ సిరీస్ లో అతను చూపిన ప్రతిభ అద్భుతమైందని రవిశాస్త్రి అన్నాడు. జట్టు మైండ్ సెట్ ను కూడా ఆయన ప్రశంసించాడు. దేశంలో గానీ విదేశాల్లో గానీ కండీషన్స్ ను ఎదుర్కునే మైండ్ సెట్ ను జట్టు సంతరించుకుందని అన్నాడు. 

20 వికెట్లు పడగొట్టే ఐదుగురు బౌలర్లు ఉంటే చాలునని ఆయన అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల సిరీస్ లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించడంతో విజయాలు దక్కాయి. తుది టెస్టు మ్యాచులో ఆరంగేట్రం చేసి నాలుగు వికెట్లు తీసుకున్న బౌలర్ షాబాజ్ నదీమ్ ను ఆయన ప్రశంసించాడు. 

నదీం సోమవారంనాడు తొలి వికెట్ తీసినప్పుడు తనకు బిషన్ సింగ్ బేడీ గుర్తుకు వచ్చాడని, బిషన్ బేడీని చూస్తున్నట్లు అనిపించిందని, మైదానం వెలుపలి నుంచి నదీమ్ ను చూడడం క్లాసికల్ గా ఉంటుందని అన్నాడు. తన సొంత మైదానంలో, తన స్థానిక ప్రేక్షకుల ముందు అద్భుతంగా ఆటను ముగించాడని, అతని ప్రారంభం కొనియాడదగిందని అన్నాడు.

నదీమ్ నెర్వస్ గా కనిపించలేదని, తొలి మూడు ఓవర్లు మేడిన్ చేశాడని, ప్రతి బంతి కూడా తగిన స్థానంలో పడిందని, అతని అనుభవం వల్లనే అది జరిగిందని అన్నాడు. జట్టు కృషి వల్లనే విజయం దక్కిందని అన్నాడు. ముందుండి నడిపించే కెప్టెన్, డబుల్ సెంచరీలు చేసే ఓపెనర్, సెంచరీలు చేసే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఉన్నారని అన్నాడు.

భారత్ కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రాణించేవారని, ప్రస్తుతం ఆరు లేదా ఏడుగురు ఆటగాళ్లు రాణిస్తున్నారని, అది ఎంతో మేలు చేస్తుందని రవిశాస్త్రి అన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios