Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి హోండా ‘సివిక్’: స్కోడా, హ్యుండాయ్, టయోటాలకు సవాల్

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా మార్కెట్లోకి ‘హోండా సివిక్’ అప్ డేట్ కారును విడుదల చేసింది. రూ.17.70 లక్షల ప్రారంభమైన హోండా సివిక్ కారు.. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు పోటీగా నిలువనున్నది.

All-New Honda Civic Launched in India for Rs 17.70 Lakh, Receives 1100 Bookings
Author
New Delhi, First Published Mar 8, 2019, 12:20 PM IST

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ‘హోండా కార్స్ ఇండియా’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపైనే భారీగా ఆశలు పెట్టుకున్నది. కంపెనీ సెడాన్ మోడల్ కారు అమేజ్‌కు వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన వస్తోంది. ఈ ఏడాది అమ్మకాల్లో ఎనిమిది శాతం అభివృద్ధిని నమోదు చేసుకోనున్నదని హోండా కార్స్  ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గాకు నకానిశి తెలిపారు. 

‘సివిక్’ సెడాన్ సరికొత్త వెర్షన్‌ కారును హోండా కార్స్  ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గాకు నకానిశి గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు రూ.17.7 లక్షల నుంచి రూ.22.3 లక్షల మధ్యలో లభించనున్నది. 

గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు కంపెనీ విక్రయాల్లో 6.5 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత నెలలో 17 వేల యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని హోండా కార్స్  ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గాకు నకానిశి అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆశావాదంగా ప్రారంభమైనా, ఆ తర్వాత జరిగిన పలు అంశాలు దెబ్బతీశాయి. వీటిలో కేరళలో వరదలు, చమురు ధరలు భగ్గుమనడం, నిధుల కొరతతో రుణాలు లభ్యత కష్టమవడం వంటి పరిణామాలు వాహన విక్రయాలపై ప్రభావం చూపాయని హోండా కార్స్  ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గాకు నకానిశి అన్నారు.

1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.6 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో ఈ కారును రూపొందించింది సంస్థ. వీటిలో పెట్రోల్ కారు 16.5 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, డీజిల్ రకం 26.8 కిలోమీటర్లు ఇవ్వనున్నదని హోండా కార్స్  ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గాకు నకానిశి తెలిపారు. 

న్యూ హోండా సివిక్ మోడల్ కారు పెట్రోల్ రకం రూ.17.7 లక్షల నుంచి రూ.21 లక్షల మధ్యలో లభించనుండగా, డీజిల్ మోడల్ రూ.20.5 లక్షల నుంచి రూ.22.3 లక్షల లోపు విక్రయిస్తున్నది. మూడు పెట్రోల్, రెండు డీజిల్ వేరియంట్లలో ఈ కారు వినియోగదారులకు లభిస్తుంది.

ఇప్పటివరకు హోండా సివిక్ మోడల్ కారు కోసం 1100 మంది బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. వచ్చే రెండు వారాల్లో బుకింగ్ చేసుకున్న వారికి ‘హోండా సివిక్’ మోడల్ కారు డెలివరీ చేయనున్నది. 

ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతోపాటు 7- ఇంచ్‌ల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో అందుబాటులో ఉన్నంది. డ్యుయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, 8- వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టీ యాంగిల్ రివ్యూ కెమెరా తదితర ఫీచర్లు చేర్చారు.

ఈబీడీతోపాటు ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిబర్ బ్యాగ్స్, కర్టైన్ ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హోండా లేన్ వాచ్, ఐఎసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ తదితర ఫీచర్లతో భద్రతా ఫీచర్లు అమర్చారు. 

1.8 లీటర్ల పెట్రోల్ వేరియంట్ కారులో సీవీటీ గేర్ బాక్స్, 6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్నాయి. 1.6 లీటర్ల పెట్రోల్, 1.8 లీటర్ల డీజిల్ వేరియంట్ సివిక్ హోండా కార్లలో పాత మోడల్ సివిక్ కారు కంటే అధికంగా 10 కేఎంపీఎల్‌కు పైగా మైలేజీ లభిస్తోంది.

పెట్రోల్ ఇంజిన్ 141 పీఎస్ పీక్ పవర్, 174 ఎన్ఎం టార్చ్ కలిగి ఉంటుంది. డీజిల్ వేరియంట్ కారు 300 ఎన్ఎం, 120 పీఎస్ సామర్థ్యం ఉంటుంది. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు హోండా సివిక్ పోటీగా నిలువనున్నది.

ఇప్పటివరకు హోండా అమేజ్ కారు మాత్రమే 27 కేఎంపీఎల్ కు పైగా మైలేజీ ఇస్తోంది. ఇక హోండా సిటీ కూడా సివిక్ మోడల్ కారు కంటే తక్కువ మైలేజీ అందిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి డిజైర్, స్విఫ్ట్ కార్లు మాత్రమే 28.4 కేఎంపీఎల్ మైలేజీనిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios