Asianet News TeluguAsianet News Telugu

చైనాపై కినుక: ‘ట్రంప్’ నేషనల్‌ ఎమర్జెన్సీ.. డోంట్ కేర్ అన్న హువావే

సుంకాలతో చైనాను లొంగదీసుకోవాలన్న అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావేను అడ్డం పెట్టుకుని సాధించాలని ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. తమ భద్రతకు ముప్పు వాటిల్లనున్నదన్న సాకుతో హువావేపై నిషేధం విధించడానికి వీలుగా జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీన్ని పట్టించుకోబోమని హువావే తేల్చేసింది. అమెరికా భద్రత అంశంపై చర్చించేందుకు సిద్దమని పేర్కొన్నది.
 

Trump executive order enables ban on Huawei telecom gear
Author
Washington D.C., First Published May 16, 2019, 2:34 PM IST

వాషింగ్టన్‌: చైనా నుంచి జరిగే అన్ని దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా ఆ దేశాన్ని లొంగ దీసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యూహం ఫలించలేదు. సుంకాల పెంపుతో పై చేయి సాధించినట్లవుతుందనుకుంటే పొరపాటని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తేల్చేయడంతో ట్రంప్ కోపం పెరిగింది. 

టెలికం రంగంలో ఇంటర్నేషనల్ లీడర్ స్థాయికి ఎదిగిన హువావేను లక్ష్యంగా చేసుకుని నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట పడింది. ఈ ఆదేశాల్లో ఏ కంపెనీ పేరును ప్రస్తావించకున్నా.. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకోని ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. 

ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు హువాయి.. చైనా కోసం గూఢచర్యం చేస్తోందని టెక్నాలజీని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ట్రంప్‌ చర్యను ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పై స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు. 

నేషనల్‌ ఎమర్జెన్సీతోపాటు అమెరికా మరో చర్య కూడా తీసుకొంది. దీని ప్రకారం హువావేపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా  అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి టెక్నాలజీని కొనుగోలు చేయకూడదు. ఈ చర్యతో అమెరికా, చైనా మధ్య సంబంధాలు ఘోరంగా  దెబ్బతినే ప్రమాదం ఉంది. 

అమెరికా మిత్రపక్షాలుగా ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ట్రంప్ ఆదేశాలు అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాల్లో మాత్రం హువావేపై నిషేధం విధించడంపై విభేదాలు ఉన్నాయి. 5జీ వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు వస్తాయని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు భావిస్తున్నాయి. 

దీనిపై చైనా కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది. తాము ఏ ప్రభుత్వానికి లోబడి పనిచేయడంలేదని తెలిపింది.

తమతో వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన అమెరికా భద్రంగా ఏమీ ఉండదని పేర్కొంది. తమతో వ్యాపారం వదులుకుని ఖరీదైన ప్రత్యామ్నాయాలవైపు అమెరికా మళ్లుతోందని తెలిపింది. అమెరికా అర్థంలేని ఆంక్షలు విధిస్తోందని హువావే విమర్శించింది. 

చైనా టెలికం కంపెనీ ‘జడ్ టీఈ’ తెర వెనుక నుంచి చైనా ప్రభుత్వం కోసం స్పైయింగ్ ద్వారా తమ టెక్నాలజీని తస్కరిస్తున్నదని అమెరికా అనుమానం. అయినప్పటికీ అమెరికా భద్రతా అంశాలపై ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని హువావే స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలు అన్ రీజనబుల్ అని హువావే తెలిపింది. 

ఇంతకుముందు ఇదే హువావే చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్.. భవిష్యత్ సారథిగా భావిస్తున్న మెంగ్ వాంగ్ జౌను అమెరికా ప్రోత్సాహంతోనే కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెను అప్పగించాలని కెనడాను అమెరికా కోరింది. ఇరాన్ పై వాణిజ్య ఆంక్షలను హువావే ఉల్లంఘించిందన్నది అమెరికా ఆరోపణ. ప్రస్తుతం మెంగ్ వాంగ్ జౌ కెనడాలోని బెయిల్‌పై వాంకోవర్ సిటీలో ఉన్నట్లు సమాచారం. 


United States President Donald Trump signed an executive order on Wednesday to stop US companies from using telecommunications equipment made by technology firms that pose a national security risk.The order paves the way for a ban on doing business with China's Huawei, though it did not name specific countries or companies. Such action was under consideration for more than a year, but was repeatedly delayed.Under the International Emergency Economic Powers Act, the president has the authority to regulate business decisions in response to a clear national threat, and the "national emergency" declaration directs the US Department of Commerce to lead enforcement efforts.

Follow Us:
Download App:
  • android
  • ios