Asianet News TeluguAsianet News Telugu

టాటా తర్వాతే రిలయన్స్.. బెస్ట్ బ్రాండ్ అంటే అదే మరి

అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా గ్రూప్’ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో జియో సాయంతో రిలయన్స్.. భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి. తొలిసారి బిగ్ బజార్ చోటు దక్కించుకున్న  బ్రాండ్స్‌లో ఒకటి. టాటా తనిష్క్, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలుగా నిలిచాయి.

Tata, Reliance and Airtel emerge best Indian brands of 2019
Author
New Delhi, First Published Mar 18, 2019, 11:12 AM IST

దేశవ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్‌గా ‘టాటా’ నిలిచింది. సంచలనాలు నెలకొల్పినా.. పరిస్థితుల ప్రభావంతో లీడర్‌గా దూసుకొచ్చినా.. సంప్రదాయంగా అత్యుత్తమ సేవలను వినియోగదారులకు అందించే సంస్థలకే అత్యుత్తమ బ్రాండ్ లభిస్తుందనడంలో సందేహం లేదు.

దేశ వ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో టాటా.. ఆ తర్వాత జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. మూడో స్థానంలో సునీల్ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్ టెల్ నిలిచాయ. అంటే వీటి సామర్థ్యం ఏమిటో విడిగా చెప్పనక్కర్లేదు. 

బ్రాండ్‌ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్‌ సంస్థ విడుదల చేసిన 40 అత్యుత్తమ ఇండియన్‌ బ్రాండ్‌ జాబితాలో టాటా దేశంలోనే సర్వోత్తమ బ్రాండ్‌గా ఎంపికైంది. రెండో స్థానంలో రిలయెన్స్‌,మూడో స్థానంలో ఎయిర్‌టెల్‌  ఉన్నాయి. 

2018లో ఆయా సంస్థలకు ఉన్న ఆదరణ, మార్కెటింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్రాండ్లలో ఈ ఏడాది తుది జాబితాను ఖరారు చేశారు. టాప్‌టెన్‌లో మూడు బ్యాంకులు ఉండటం విశేషం.

వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ (మూడో ర్యాంకు) ఎస్బీఐ (ఆరో ర్యాంకు) ఉన్నాయి. ఇక రిటైల్ దిగ్గజం బిగ్‌బజార్‌ మొదటిసారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నది. రిటైల్ దిగ్గజం బిగ్ బజార్ బ్రాండ్‌ విలువ 2,686 కోట్లుగా నిర్ణయించారు.

ఇక భారతీయ ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 32,235 కోట్లు కాగా, టాటా బ్రాండ్‌ వ్యాల్యూ 2018 లో ఆరుశాతం లాభాలు ఆర్జించింది. ఈ గ్రూపులో ఐటీ కంపెనీ  టీసీఎస్‌ ప్రధానపాత్ర పోషించింది. 

అలానే రిలయెన్స్‌ ఇండిస్టీ బ్రాండ్‌ వ్యాల్యూ కూడా 12 శాతం అధికంగా నమోదుచేసుకున్నది. రిలయన్స్ జియో వల్ల ఎక్కువ లాభపడింది. మరోవైపు ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 13 శాతం తక్కువగా నమోదైంది. 

జాబితాలో ఎంపిక చేసిన 40 బ్రాండ్ల విలువ గణనీయంగా పెరిగినట్టు వెల్లడైంది. కాగా 27 శాతం సర్వీస్‌ సెక్టార్‌ నుంచి లాభాలు నమోదు చేయగా, 10శాతం మేర ఆటోమొబైల్‌ రంగనుంచి ఉన్నట్టు నిర్వాహకులు గుర్తించారు.

ఇక ఇంటర్‌ బ్రాండ్ల వారీగా జాబితాలోకి బిగ్‌బజార్‌, డీమార్ట్‌ సంస్థలు చేరాయి. ప్రస్తుతం బిగ్‌ బజార్‌ 33 వ స్థానంలో నిలిచింది. దీని బ్రాండ్‌ వ్యాల్యూ 2,686 కోట్లు, డీమార్ట్‌ 37 వ ర్యాంకును దక్కించుకున్నది. దీని బ్రాండ్‌ వ్యాల్యూ 2,015గా నిర్ధారించారు.

ఇక ఎయిర్ టెల్ తర్వాత ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, మహీంద్రా గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, గోద్రేజ్ సంస్థలు టాప్ టెన్‌లో నిలిచాయి. టాప్ టెన్‌లో స్థిర పడిన బ్రాండ్ల విలువ.. టాటా రూ. 78,722 కోట్లు, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌  రూ. 42,826 కోట్లు, సునీల్ మిట్టల్ సారథ్యంలోని భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 32,235 కోట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఇక ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాండ్ విలువ రూ. 29,963 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ బ్రాండ్ రూ. 28,095 కోట్లు, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ విలువ రూ. 25,620 కోట్లుగా నమోదైంది. 

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బ్రాండ్ వాల్యూ రూ. 24,367 కోట్లు, బహుళ సంస్థల సమ్మేళనం మహీంద్రా గ్రూప్‌ వాల్యూ రూ. 18,389 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువ రూ. 16,993 కోట్లు, గోద్రేజ్‌ బ్రాండ్ వాల్యూ రూ. 16,897 కోట్లుగా నమోదైంది. 

టాప్ - 40 బ్రాండ్ల విలువ 5.2 శాతం పెరిగి రూ.50.03 బిలియన్లకు ఎగసింది. ఫైనాన్సియల్ సర్వీసెస్  27 శాతం, ఆటోమొబైల్ సంస్థలు 10 శాతం బ్రాండ్ వాల్యూ పెంచుకున్నాయి. ఇక నెరోలాక్ పెయింట్స్ 39వ స్థానంలో నిలిచింది. 

ఆటోమొబైల్ రంగం సగటున 16 శాతం బ్రాండ్ విలువ పెంచుకున్నది. రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్, హీరో, మారుతి సుజుకి, మహీంద్రా గ్రూప్ సంస్థలు సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించాయి. 

టాటా ‘తనిష్క్’, రాయల్ ఎన్ ఫీల్డ్, కొటక్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ పెంచుకున్న సంస్థలు. రిలయన్స్ గ్రూప్, కెనరా బ్యాంక్ ఈ ఏడాది ఆసక్తి పెంచాయి. లగ్జరీ బ్రాండ్ వస్తువుల విలువ 42 శాతం పెరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios