Asianet News TeluguAsianet News Telugu

ఇక లాంఛనమే ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో.. వచ్చే నెల్లో లిస్టింగ్

అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్ కో లాంఛనంగా ఐపీవోకు వెళ్లనున్నది. 2016లోనే ప్రయత్నించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. వచ్చేనెలలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది.
 

Saudi Arabia Kick Starts IPO Of Worlds Largest Oil Company
Author
Hyderabad, First Published Nov 4, 2019, 12:13 PM IST

దహ్రన్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఐపీఓ (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వెళుతున్నట్లు లాంచనంగా ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈ కంపెనీ 2016లోనే ఐపీఓకు వచ్చేందుకు ప్రయత్నించింది. 

వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ ఐపీఓ ఎట్టకేలకు సాకారం అవుతోంది. బుక్‌ బిల్డింగ్‌ విధానంలో షేర్లు జారీ చేస్తామని, కంపెనీ చైర్మన్‌ యాసిర్‌ అల్‌–రుమయ్యన్‌ ఆదివారం తెలిపారు. ఆఫర్‌ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్‌ బిల్డింగ్‌ పీరియడ్‌ చివర్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేయవచ్చని ఆరామ్ కో చైర్మన్‌ యాసిర్‌ అల్‌–రుమయ్యన్‌ తెలిపారు. సౌదీ వాసులు, సౌదీ అరేబియాలో నివాసం ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్‌ వాసులు కూడా దరఖాస్తు చేయవచ్చని వివరించారు. 

also read ఆటోమేషన్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్టప్

ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను సౌదీ అరామ్ కో వెల్లడించనున్నది. సౌదీ ఆరామ్‌కో షేర్ల ట్రేడింగ్‌  సౌదీ  స్టాక్‌ ఎక్చ్చేంజ్ ‌(తాదావుల్‌)లో వచ్చే నెల (బహుశా డిసెంబర్‌ 11న) మొదలు కావచ్చని అంచనా.  

ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ బహుశా సౌదీ ఆరామ్ కో సంస్థదే కానున్నది. ఎంత వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదో అనే నిర్ణయాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. విశ్లేషకులైతే ఈ కంపెనీ విలువను 1.7–1.5  లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా వేశారు.

Saudi Arabia Kick Starts IPO Of Worlds Largest Oil Company

ఒక్కశాతం వాటా విక్రయిస్తే, ఐపీఓ సైజు సుమారుగా 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. ఒకవేళ 2 శాతం వాటా విక్రయిస్తే, ఇష్యూ సైజు 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఇదే అవుతుందని అంచనా.

ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ రికార్డ్‌ ఇప్పటిదాకా అలీబాబా కంపెనీ (2,500 కోట్ల డాలర్లు) పేరిట ఉంది. కాగా, ప్రస్తుతం విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ చేసే ఆలోచనను సౌదీ ఆరామ్‌కో పక్కనపెట్టింది. కాగా మన దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతి పెద్ద ఐపీఓ కోల్‌ ఇండియాదే (రూ.15,100 కోట్లు–సుమారుగా 200 కోట్ల డాలర్లు).

గతేడాదిలో సౌదీ ఆరామ్‌కో కంపెనీకి 11,110 కోట్ల డాలర్ల నికర లాభం వచ్చింది. ఇది దిగ్గజ కంపెనీలు–యాపిల్, గూగుల్, ఎక్సాన్‌ మొబిల్‌ కంపెనీల మొత్తం నికర లాభం కంటే కూడా ఎక్కువే కావడం విశేషం. ఆరామ్ కో ఐపీఓకు వెళ్లడం కంపెనీ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొంది. 

also read బీకేర్‌పుల్: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎన్ని షేర్లను విక్రయించే అవకాశం ఉందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచ చమురు మార్కెట్లో సౌదీ అరామ్కో వాటా 10 శాతం ఉంది. ఇప్పుడు కంపెనీ మార్కెట్‌ విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

తొలుత తడావుల్‌ సౌదీ ఎక్స్ఛేంజీలో రెండు శాతం, ఆ తర్వాత విదేశీ ఎక్స్చేంజీలో మూడు శాతం వాటాను విక్రయించాలని భావిస్తున్నారని తెలిసింది. అయితే విదేశీ మార్కెట్‌ వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

చైనా ఈ -కామర్స్ సంస్థ ‘ఆలీబాబా’ సంస్థ ఐపీఓ విలువ 2500 కోట్ల డాలర్లు కాగా, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐపీఓ విలువ 2,210 కోట్ల డాలర్లుగా ఉంది. ఇండస్ట్రీయల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా 2,190 కోట్ల డాలర్లు, ఏఐఏ గ్రూప్ (అమెరికా) 2050 కోట్ల డాలర్లు, అమెరికాకే చెందిన వీసా ఇన్ కార్పొ సంస్థ 1960 కోట్ల డాలర్లుగా ఐపీఓ రికార్డు కానున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios