Asianet News TeluguAsianet News Telugu

జియోకు కష్టకాలం: త్రిశంకు స్వర్గంలో ఆర్-కాంతో ఒప్పందం

అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్), ఆయన అన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఖరారు కాకపోతే కీలక మార్కెట్లు గల రూట్లలో జియో సేవలకు అంతరాయం ఏర్పడుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. 
 

Reliance Jio subscribers may face disruption if Reliance Communications deal fails
Author
New Delhi, First Published Dec 28, 2018, 11:24 AM IST

కోల్‌కతా: అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్), ఆయన అన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఖరారు కాకపోతే కీలక మార్కెట్లు గల రూట్లలో జియో సేవలకు అంతరాయం ఏర్పడుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ప్రత్యేకించి ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సర్కిళ్ల పరిధిలో వినియోగదారులకు సేవల్లో అంతరాయం కలుగుతుందని టెలికం ఇండస్ట్రీ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జియోకు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) స్పెక్ట్రం అమ్ముకునేందుకు అంగీకారం, ఒప్పందం కుదిరింది. కానీ టెలికం శాఖ (డాట్) అభ్యంతరాలు తెలిపింది. ఆపై రుణ దాతలకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెల్లించకపోతే తమ బాధ్యత కాదని డాట్‌కు జియో లేఖ రాయడంతో పరిస్థితి విషమించింది. 

జియో, డాట్ సంయుక్తంగా అంగీకరిస్తేనే ఆర్-కామ్ తన స్పెక్ట్రం విక్రయానికి వీలు కలుగుతుంది. అప్పుల ఊబి నుంచి, దివాళా నుంచి బయటపడేందుకు అనిల్ అంబానీ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇటు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫోన్ సేవలు వినియోగదారులకు అందజేయాలంటే అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ - కామ్ వద్ద ఉన్న ఐదు 840 ఎంహెచ్జ్ బాండ్ స్పెక్ట్రం అవసరం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ముంబై, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు 4జీ ఎల్టీఈ సేవలు అందించాలన్నా ఆర్ కామ్ స్పెక్ట్రం కావాల్సి ఉంటుంది. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.46 వేల కోట్ల రుణాల ఊబిలో చిక్కుకున్నది. జియోతో ఒప్పందం కుదిరితే రూ.18 వేల కోట్ల రుణభారం తగ్గించుకోగలుగుతుంది ఆర్-కామ్. లేదంటే దివాళా ప్రక్రియను ఎదుర్కోవాల్సిన ఆర్- కామ్ పరిస్థితి దారుణంగా మారుతుందని భావిస్తున్నారు.

ఏతావాతా జమ్ముకశ్మీర్ మినహా 21 సర్కిళ్ల పరిధిలో జియో సేవలు అందించాలంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ వద్ద గల వాయు తరంగాలే కీలకం. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన వద్ద గల 800 ఎంహెచ్జ్ ఎల్టీఈ స్పెక్ట్రం 65 అదనపు యూనిట్లు కూడా 4జీకి విక్రయించేందుకు తద్వారా తన రుణ భారాన్ని రూ.3,700 కోట్లు తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. ఇటువంటి పరిస్థితుల్లో జియో.. ఆర్ - కామ్ స్పెక్ట్రంను షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేదు. 

ప్రభుత్వ విధానం ప్రకారం రాష్ట్రాల్లో రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి గల నెట్వర్క్‌ల పరిధిలో మాత్రమే షేరింగ్ సాధ్యం. అయితే ఏడాది క్రితమే రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన వైర్ లైస్ సర్వీసులను మూసివేసింది. ప్రస్తుతానికి రిలయన్స్ కమ్యూనికేషన్లకు చెందిన 800 ఎంహెచ్జ్ బాండ్ కింద ఎల్టీఈ సర్వీసుల కిందే జియో 1800, 2300 ఎంహెచ్జ్ బాండ్ల సేవలందిస్తున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios