Asianet News TeluguAsianet News Telugu

ప్రాణ సంకటం: డైమండ్స్‌పై ఇంపోర్ట్ డ్యూటీతో లక్ష జాబ్స్ గోవిందా!!

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. అందునా సూరత్ పట్టణం వజ్రాలు, బట్టల వ్యాపారాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి వజ్రాలకు సానపెడుతూ డైమండ్ల బిజినెస్ కేంద్రంగా బాసిల్లుతోంది సూరత్

One lakh Surat diamond workers may lose jobs
Author
New Delhi, First Published Oct 28, 2018, 12:48 PM IST


కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. అందునా సూరత్ పట్టణం వజ్రాలు, బట్టల వ్యాపారాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి వజ్రాలకు సానపెడుతూ డైమండ్ల బిజినెస్ కేంద్రంగా బాసిల్లుతోంది సూరత్. కానీ అదే సూరత్ కు అంటే వజ్రాల వ్యాపారులకు, వారిపై ఆధారపడి బతికే లక్షల కుటుంబాలకు నరేంద్రమోదీ సర్కార్ గట్టి షాకే ఇచ్చింది. కరంట్ ఖాతా లోటు (క్యాడ్), అటుపై ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యంగా గత నెల 26వ తేదీన శుద్దిచేసిన డైమండ్ల దిగుమతిపై సుంకాన్ని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అక్కడి ఉద్యోగాల కల్పనపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నది. 

ఇప్పటికే రూపాయి పతనం దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డైమండ్ పరిశ్రమపై దిగుమతి సుంకం రూపంలో మరో పిడుగు పడ్డట్టు అయింది. దీంతో వచ్చే ఆరు నెలల్లో ఈ రంగంలో లక్ష మందికి పైగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వజ్రాల పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాడ్ నియంత్రణ కోసం పలు దిగుమతి వస్తువులపై సుంకాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం డైమండ్ల పరిశ్రమకు ప్రాణసంకటంగా మారింది.

కట్ చేసిన, ఫాలిష్డ్ వజ్రాల దిగుమతి సుంకం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రీకట్టింగ్, రీ డిజైనింగ్ చైనా, థాయిలాండ్‌లకు మళ్లి పోతున్నదని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన చెందుతున్నారు. నగదు కొరత, సుంకం ప్రభావం తీవ్రంగా ఉన్నదని జెమ్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కోలిన్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా వజ్రాల వ్యాపారంలో ఐదు లక్షల మంది పాల్గొంటారని ఒక అంచనా.   

అసలే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పాలిష్ చేసిన డైమండ్ల దిగుమతి 31.83 శాతం తగ్గి ఆదాయం రూ.5,289.35 కోట్లకు పడిపోయాయి. దీంతో ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ మార్కెటైన సూరత్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. సులభతర వాణిజ్యంలో ఇబ్బందులు తలెత్తడం, నిధుల కొరతతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమపై దిగుమతి సుంకం పెంపుతో వచ్చే ఆరు నెలల్లో లక్ష మందికి పైగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కోలిన్ షా తెలిపారు.

దీపావళి పండుగ సందర్భంగా సూరత్ పట్టణంలోని డైమండ్ కట్టింగ్ అండ్ పాలీషింగ్ యూనిట్లు లాభాలు గడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి కేరళలో భారీ వరదల వల్ల వివాహాలు తగ్గుముఖం పట్టి వజ్రాల కొనుగోలుపై సెంటిమెంట్ దెబ్బ తిన్నదని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కోలిన్ షా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios