Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ దివాళా తీయడం ఖాయం....సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంచలన వ్యాఖ్యలు

ఎంతో కష్టపడి వృద్దిలోకి తెచ్చిన వ్యాపార సామ్రాజ్యంపై ఎవరైనా చిన్న ఆరోపణలు చేస్తేనే మనం తట్టుకోలేం. వారి విమర్శలను వెంటనే తిప్పికొడతాం. అలాంటిది  తనను ప్రపంప కుబేరుల జాబితాలో నిలిపిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గురించి ఆ సంస్థ వ్యవస్థాపకుడే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఎంతో సక్సెస్ తో దూసుకుపోతున్న అమెజాన్ ఎప్పటికైనా కుప్పకూలి దివాళా తీయడం ఖాయమంటూ జెఫ్ బెజోస్ ఆరోపించారు. 
 
One day, Amazon will fail: ceo jen bezos
Author
USA, First Published Nov 16, 2018, 3:09 PM IST

ఎంతో కష్టపడి వృద్దిలోకి తెచ్చిన వ్యాపార సామ్రాజ్యంపై ఎవరైనా చిన్న ఆరోపణలు చేస్తేనే మనం తట్టుకోలేం. వారి విమర్శలను వెంటనే తిప్పికొడతాం. అలాంటిది  తనను ప్రపంప కుబేరుల జాబితాలో నిలిపిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గురించి ఆ సంస్థ వ్యవస్థాపకుడే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఎంతో సక్సెస్ తో దూసుకుపోతున్న అమెజాన్ ఎప్పటికైనా కుప్పకూలి దివాళా తీయడం ఖాయమంటూ జెఫ్ బెజోస్ ఆరోపించారు. 

అమెరికాలోని అమెజాన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో బెజోస్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి రిటైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా కొన్ని దిగ్గజ సంస్థలు దివాళా  తీయడం  ద్వారా మీరు ఏం తెలుసుకున్నారని ప్రశ్నించాడు.ఈ ప్రశ్నకు బెజోస్ చెప్పిన సమాధానం అందరినీ షాక్ కు గురించేసింది. 

ఎంతటి దిగ్గజ కంపనీ అయినా ఓ సమయంలో కుప్పకూలడం ఖాయమని...ఏ సంస్థ కూడా మూడు దర్శాబ్దాలకు పైబడి మనుగడ సాగించలేకపోయాయయని అన్నారు. అలాంటి సంస్థల్లో అమెజాన్ కూడా ఒకటనీ...ఇది కూడా ఏప్పుడో ఒకప్పుడు కుప్పకూలి దివాళా తీయడం ఖాయమన్నారు. కానీ ఉద్యోగులు అంత తొందరగా ఆ సమయం రాకుండా ఉండేందుకు కష్టపడి పనిచేయాలని బెజోస్  సూచించారు.  
      
Follow Us:
Download App:
  • android
  • ios