Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రానూయి?

ఎట్టకేలకు వచ్చేనెల ఒకటో తేదీన ప్రపంచబ్యాంక్ తదుపరి చైర్మన్ పేరు ఖరారైనట్లే. పెప్సికో సీఈఓగా సుదీర్ఘకాలం పని చేసిన భారత సంతతి మహిళ ఇంద్రానూయిని ఈ పదవికి నామినేట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ చెప్పినట్లు సమాచారం. 

Indra Nooyi as World Bank president? White House is interested
Author
Washington, First Published Jan 16, 2019, 1:18 PM IST

వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంక్‌ అధ‍్యక్ష పదవి రేసులో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి తెరపైకి వచ్చారు. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనతో ఆమె ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షరాలిగా ఇంద్రానూయిను తాము నామినేట్‌ చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ కూమార్తె ఇవాంకా ట్రంప్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. 

ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటో తేదీన జిమ్ యాంగ్ కిమ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం కానుంది. 

12 ఏళ్లుగా పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రానూయి.. గత ఆగస్ట్‌లో పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ప్రతిపాదించే వ్యక్తుల్లో ఇవాంక ట్రంప్‌ కీలక వ్యక్తి కావడంతో ఆమె విజ్ఞప్తిని సభ్య దేశాలు ఆమోదించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఇంద్రా నూయికి ప్రత్యేక స్థానం ఉందని ట్రంప్‌, ఇవాంకా పలుసార్లు ప్రశంసించిన సంగతి తెలిసిందే.  

మొదట ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవికి ట్రంప్ గారాల పట్టి కం ఆయన సలహాదారు ఇవాంకా, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. తాజా వార్తలు నిజమైతే.. ఎట్టకేలకు ప్రపంచబ్యాంక్ చైర్మన్ లేదా చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఇంద్రా నూయి రికార్డు నెలకొల్పుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios