Asianet News TeluguAsianet News Telugu

స్కిల్స్‌@హైదరాబాద్: ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్‌కు ఫుల్ డిమాండ్

ఎక్కడైనా, ఏ రంగమైనా సాఫ్ట్‌వేర్‌, మేనేజ్‌ మెంట్‌ నిపుణులకు గిరాకీ నెలకొంది. టాలెంట్‌ను ఆకర్షిస్తున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ ఉన్నదని లింక్డ్‌ఇన్‌ పేర్కొంది. 

Hyderabad pips Mumbai in wooing talent: Linkedin
Author
Hyderabad, First Published Apr 11, 2019, 1:18 PM IST

హైదరాబాద్: ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, వడోదరా, జైపూర్‌ వంటి టాప్‌ 10 నగరాలు వృత్తి నిపుణులకు గమ్యస్థానాలుగా మారుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలకు అన్ని రంగాల్లోనూ మంచి డిమాండ్‌ ఉందని లింక్డ్‌ ఇన్‌ కంట్రీ మేనేజర్‌ (ఇండియా) మహేష్‌ నారాయణన్‌ తెలిపారు.

దేశీయంగా ఉన్న అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అధిక డిమాండ్‌ కల నైపుణ్యాలు, ఉద్యోగాలకు ముఖ్యమైన గమ్యస్థానాలతో రూపొందించిన నివేదికను ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ విడుదల చేసింది. 2018 ద్వితీయార్ధానికి (జూలై - డిసెంబర్) ఇండియా వర్క్‌ఫోర్స్‌ పేరుతో ఈ నివేదిక రూపొందించారు.
 
ద్వితీయార్ధంలో వృత్తి నిపుణుల ధోరణులు- అగ్రస్థాయి ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఐటీ సర్వీసెస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫైనాన్స్‌, కార్పొరేట్‌ సర్వీసెస్‌, ఎడ్యుకేషన్‌ వంటివి ప్లాట్‌ఫామ్‌పై అతిపెద్ద పరిశ్రమలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎక్కువ మందిని నియమించుకున్నాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌ 5 పరిశ్రమల్లో ఫైనాన్స్‌, వెల్‌నెస్‌ అండ్‌ ఫిట్‌నెస్‌, రియల్‌ ఎస్టేట్‌, లీగల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్థానం సంపాదించుకున్నాయి.

ముంబై, హైదరాబాద్‌ సహా ఐదు నగరాల్లో హెల్త్‌కేర్‌ టాప్‌ 5 పరిశ్రమల్లో ఒకటిగా ఉంది. అతిపెద్ద పరిశ్రమలు, వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమల నియామకాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే అగ్రస్థానంలో ఉన్నారు. 2018 ప్రథమార్ధం, ద్వితీయార్ధంలోనే ఇదే ట్రెండ్‌ ఉంది.వెల్‌నెస్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ పరిశ్రమలోనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అధిక డిమాండ్‌ ఉంది.

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన బిజినెస్‌ ఎనలిస్ట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్ల నియామకాలు కూడా ద్వితీయార్ధంలో అధికంగా ఉన్నాయి. డేటా సంబంధించిత ఉద్యోగాల వాటా పెరుగుతోంది. లీగల్‌, హెల్త్‌కేర్‌ పరిశ్రమల్లో డేటా విశ్లేషకులకు ప్రాధాన్యం పెరుగుతోంది. 

అన్ని రంగాల్లోనూ మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ నైపుణ్యాలకు సమానమైన డిమాండ్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఐటీ, ఫైనాన్స్‌ రంగాల్లో ఎస్‌క్యూఎల్‌, జావా, ప్రొగ్రామింగ్‌ లాగ్వేజ్‌ సీ వంటివి టాప్‌ టెక్‌ స్కిల్స్‌గా ఉన్నాయి.

మాన్యుఫ్యాక్చరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, ఎనర్జీ అండ్‌ మైనింగ్‌, డిజైన్‌ ఇండస్ర్టీల్లో ఆటోక్యాడ్‌కు అత్యధిక డిమాండ్‌ ఉంది. మేనేజ్‌మెంట్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌ తర్వాత కస్టమర్‌ సర్వీస్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సాఫ్ట్‌ నైపుణ్యాలకు విభిన్న రంగాల్లో మంచి గిరాకీ నెలకొంది.

ఫైనాన్స్‌, కార్పొరేట్‌ సర్వీసెస్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషన్‌ పరిశ్రమల్లో మేనేజ్‌మెంట్‌ అధిక డిమాండ్‌ ఏర్పడింది. ముంబై, న్యూఢిల్లీ నగరాలు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నాయి. బెంగళూరు మాత్రం టెక్నికల్‌, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలపై దృష్టిసారిస్తోంది.

ఎస్‌క్యూఎల్‌, సీ, జావా, సీ++, హెచ్‌టీఎంఎల్‌ ఎగుమతిలో భారత్‌ ప్రముఖ ఎగుమతిదారుగా ఉంది. భారత్‌లోని వృత్తి నిపుణులు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే ముందుగా అమెరికాను ఎంచుకుంటున్నారు. భారత్‌ నుంచి వలసవెళ్లే ముగ్గురిలో ఒకరు అమెరికాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా తర్వాతి నాలుగు స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ర్టేలియా ఉన్నాయి.
 
దేశంలోని దాదాపు సగం మంది వృత్తి నిపుణులు ఐదు నగరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటి 1. ఎన్‌సీఆర్‌ (ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా) 2. బెంగళూరు 3.హైదరాబాద్‌ 4.ముంబై 5. చెన్నై ఉన్నాయి. వీటి తర్వాత ఎక్కువ టాలెంట్‌ను ఆకర్షిస్తున్న నగరాల్లో కోల్‌కతా, అహ్మదాబాద్‌, చండీగఢ్‌ ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios