Asianet News TeluguAsianet News Telugu

షియోమీ టు ఐఫోన్: స్మార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఆఫర్స్

ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనంజా సేల్ సోమవారం మొదలైంది. రెడ్ మీ నోట్, రియల్ మీ, పొకో నుంచి యాపిల్ ఐ ఫోన్ల వరకు భారీగా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 
 

Flipkart Mobiles Bonanza sale begins, big discounts on Redmi Note 6 Pro, Realme 2 Pro, Poco F1
Author
New Delhi, First Published Feb 19, 2019, 10:57 AM IST

ఇటు ఫ్లిప్‌కార్ట్‌/వాల్‌మార్ట్.. అటు అమెజాన్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. అమెజాన్ ‘యాపిల్ ఫెస్ట్’ అమలు చేస్తుండగా, ఫ్లిప్ కార్ట్ మరో దఫా 'మొబైల్స్ బొనాంజా సేల్' ను ప్రకటించింది . అయిదు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. 

ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా  షియోమీ, రియల్‌ మీ, ఆసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి  ఆఫర్లు కూడా ఉన్నాయి.

పోకో ఎఫ్‌‌1 6జీబీ, 64జీబీ స్టోరేజ్‌  రూ.17,999 లకే అందిస్తోంది. ఎంఆర్‌పీ రూ.19,999. దీంతోపాటు  రూ.3,000 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. పోకో ఎఫ్‌‌1 6జీబీ కమ్ 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా  రూ.20,999కు లభిస్తుంది. 

రియల్‌ మీ 2 ప్రొ మోడల్ 4జీబీ కమ్ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్ అసలు ధర రూ.12,990 కాగా, రూ.11,990లకే లభిస్తోంది. ఈ ఆఫర్ రూ.1000 విలువైన ప్రీ పెయిడ్ ఆర్డర్ ఆఫర్‌తో కలిపి లభిస్తుంది. రియల్ మీ ‘2 ప్రో’అన్ని వేరియంట్లపైనా ఈ డిస్కౌంట్ అమలవుతుంది. 

త్వరలో రెడ్ మీ నోట్ 7 మోడల్ ఫోన్ మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ 4జీబీ కమ్ 64జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ అసలు ధర రూ.13,999 కాగా,  రూ.12,999లకే లభిస్తుంది. ఇక రెడ్ మీ నోట్ 5 ఫోన్ రూ.11,900లకు లభిస్తుంది. రెడ్ మీ వై2, రెడ్ మీ 6 ఫోన్లపైనా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. 

3జీబీ కమ్ 32జీబీ స్టోరేజ్‌ గల ఆసుస్‌ జెన్‌ మాక్స్‌ ప్రొ ‘ఎం1’ఫోన్‌ డిస్కౌంట్ పోగా రూ.8,499లకే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఆసుస్‌ జెన్‌ మాక్స్‌ప్రొ ఎం2 4 జీబీ కం 64జీబీ  సామర్థ్యం గల  ఫోన్‌ ధర రూ.14,999 కాగా, రూ.11,999కే లభిస్తోంది.  ఇతర అసుస్ జెన్ మోడల్ ఫోన్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

వివో వీ9 ప్రో మోడల్ ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ రూ.1,500 రాయితీతో రూ.12,490లకు అందజేస్తోంది. రియల్ మీ సీ1 ఫోన్ డిస్కౌంట్ పై రూ.6,999లకే లభిస్తోంది. ఇక నోకియా 6.1 మోడల్ ఫోన్ రూ.13,999, నోకియా 5.1 ప్లస్ మోడల్ ఫోన్ ధర రూ.8,999లకు లభిస్తున్నాయి. 

శామ్‌సంగ్ గేలాక్సీ ఎస్ 10 మోడల్ ఫోన్ ఆవిష్కరణ నేపథ్యంలో ఎస్8 వేరియంట్ ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ కల్పిస్తోంది. దీంతో రూ.30,990లకే శామ్ సంగ్ ఎస్8 ఫోన్ లభిస్తుంది. వివో నెక్స్ రూ.39,990లకు, వివో ఎక్స్ 21 ఫోన్ రూ.26,990, జెన్ ఫోన్ 5జడ్ రూ.24,999, ఎల్జీ జీ 7 థింక్ రూ.27,999లకు లభిస్తాయి. 

యాపిల్ ఐఫోన్లపైనా యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్ ధరలు రూ.37,999 వద్ద ప్రారంభం అయ్యాయి. అయితే దీనిపై రూ.16,999 డిస్కౌంట్ కల్పిస్తోంది. ఐ ఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్ ధర రూ.27,999 వద్ద నుంచి మొదలవుతుంది. ఐఫోన్ 8 ఫోన్ ధర డిస్కౌంట్ పై రూ.56,999లకు అందుబాటులో ఉంటుంది. 

హానర్‌ 9ఎన్‌ మోడల్ 4జీబీ కమ్ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఫోన్ రూ. రూ.8,499 లభిస్తుండగా, వివో వి9 ప్రొ 4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్ అందజేస్తోంది. ఇక మోటరోలా వన్‌ పవర్‌ 4జీబీ కం 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఫోన్ రూ.13,999లకే లభించనున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios