Asianet News TeluguAsianet News Telugu

జాక్ డోర్సీకి షాక్: ట్విట్టర్​ నుంచి ఎలాన్​ మస్క్​ ఔట్

ట్విట్టర్​ ఖాతా నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు టెస్లా చీఫ్ ఎలాన్​ మస్క్ తెలిపారు. ఆయనకు ట్విట్టర్​లో 29 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
 

Elon Musk Says He Is Disconnecting From Twitter
Author
Hyderabad, First Published Nov 2, 2019, 12:14 PM IST

శాన్ ఫ్రాన్సిస్కో: టెస్లా చీఫ్​ ఎలాన్​ మస్క్​ ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు తన చివరి ట్వీట్​లో పేర్కొన్నారు. బహుశా ఆయన.. ప్రముఖ వార్తా, చర్చా వేదిక అయిన రెడ్డిట్ అనుకూలంగా ఈ చర్య తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాన్​కు ట్విట్టర్​లో 2 కోట్ల 9 లక్షల మంది అభిమానులు ఉన్నారు.

also read ఆడికార్లపై అదిరిపోయే బంపర్ ఆఫర్‌....

తరచుగా ట్వీట్​లు చేసే ఎలాన్​ మస్క్​ ఆయన అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజీ కమిషన్​తోనూ విబేధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఎలాన్​ మస్క్​ తన ట్వీట్​లతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టిస్తున్నారని యూఎస్ సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్ఛేంజీ కమిషన్ ఆరోపించింది.

Elon Musk Says He Is Disconnecting From Twitter

‘ట్విట్టర్​ మంచి గురించి నాకు కచ్చితంగా తెలియదు. రెడ్డిట్​ చాలా బాగుంది. అయితే నేను ఆఫ్​లైన్​లోకి వెళ్తున్నాను’ అని ఎలాన్​ మస్క్ చివరి ట్వీట్ చేశారు. గతేడాది థాయిలాండ్​లోని నీటి అడుగున ఉన్న గుహలో చిక్కుకున్న 12 మంది బాలలను నాటకీయంగా రక్షించడంలో సహకరించిన వ్యక్తి.. ఎలాన్​ మస్క్​పై పరువునష్టం కేసు వేశారు. అతడిని 'పెడో గాయ్' అంటూ ఎలాన్​ మస్క్ ట్వీట్​ చేయడమే ఇందుకు కారణం.

also read ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? అయితే ఇది తెలుసుకోండి.

అయితే కేవర్​ను నిందించడం తన ఉద్దేశ్యం కాదని మస్క్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఈ పదాన్ని సాధారణంగా వాడుతుంటారని తెలిపాడు. 'పెడో గాయ్'​ అంటే.. 'భయంగొలిపే వృద్ధుడు' అని అర్థం. ఈ కేసు డిసెంబర్​ 2న విచారణకు రానుంది.ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్​ మస్క్ ప్రకటించడంపై అతని ఫాలోవర్లు విచారం వ్యక్తం చేశారు. ఆన్​లైన్​లో మస్క్ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios