Asianet News TeluguAsianet News Telugu

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సవాల్: జావా 300& 42 బైక్‌ల మైలేజీ ఇదీ

త్వరలో మార్కెట్లోకి ప్రవేశించనున్న జావా 300, జావా 42 బైక్‌లు.. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటారు సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 
 

Jawa, Jawa Forty Two Official Mileage Revealed, Matches Royal Enfield Classic 350
Author
New Delhi, First Published Apr 7, 2019, 3:22 PM IST

జావా మోటార్ సైకిల్స్ త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న జావా స్టాండర్డ్ 300, జావా 42 మోటార్ సైకిళ్ల మైలేజీ బయటపడింది. 293 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ రెండు బైక్‌ల మైలేజీ 37.5 కిలోమీటర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ బైక్‌లకు దీటుగా జావా బైక్ పోటీనిస్తుంది. 

లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్, డీవోహెచ్సీ ఇంజిన్, డబుల్ క్రెడిల్ చేసిస్ నెస్టెడ్ 293 సీసీ సామర్థ్యం గల జావా మోటారు సైకిళ్లు 300, జావా 42 బైక్‌లు కలిగి ఉంటాయి. జావా ధర రూ.1.64 లక్షలు, జావా 42 ధర రూ.1.65 లక్షలు పలుకుతుంది.

డ్యూయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్ గల జావా 300 మోడల్ బైక్ రూ.1,72,942, జావా 42 బైక్ ధర రూ. 1,63,942 పలుకుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పీతాపూర్ ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతోంది. 

ఇంతకుముందు జావా మోటార్స్ యాజమాన్యం గతేడాది నవంబర్ 15వ తేదీ నుంచి కస్టమర్ల నుంచి ప్రీ బుకింగ్ ఆర్డర్లు స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా 77 నగరాల పరిధిలోని 95 జావా మోటార్ సైకిల్ డీలర్ షిప్‌ల వద్ద కొత్త మోడల్ బైక్‌లు లభిస్తాయి. 

మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ ద్వారా జావా మోటారు సైకిళ్లను డీలర్ షిప్‌లకు సరఫరా చేస్తున్నారు. ఆసక్తి గల కస్టమర్లు ఏదైనా పాత బైక్ ఎక్స్చేంజ్ ద్వారా నూతన బ్రాండ్ జావా మోటారు సైకిల్ పొందొచ్చునని తెలిపింది. ఇంకా అధికారికంగా జావా మోటార్ సైకిల్ 300, జావా 42 మోడల్ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టే తేదీ ఇంకా ఖరారు కాలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios