Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి Suzuki GSX-S750: ధరెంతో తెలుసా?

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్స్ తన కొత్త బైక్ సుజుకి జీఎస్ఎక్స్-ఎస్750(Suzuki GSX-S750)ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్ చాలా కాస్మోటిక్ మార్పులుతోపాటు రెండు కలర్స్‌లో తీసుకొచ్చింది. 

2019 Suzuki GSX-S750 Launched In India Priced At Rs 7.46 Lakh
Author
New Delhi, First Published Apr 20, 2019, 1:24 PM IST

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్స్ తన కొత్త బైక్ సుజుకి జీఎస్ఎక్స్-ఎస్750(Suzuki GSX-S750)ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్ చాలా కాస్మోటిక్ మార్పులుతోపాటు రెండు కలర్స్‌లో తీసుకొచ్చింది. 

Suzuki GSX-S750 ధర(ఇండియా ఎక్స్ షోరూం)ను రూ.7.46లక్షలుగా నిర్ణయించింది. గత సంవత్సరమే ఈ GSX-S750 మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. ఇప్పుడు రెండు కొత్త కలర్లు మెటాలిక్ మాట్ట్ బ్లాక్ అండ్ పెర్ల్ గ్లేసియర్ వైట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కలర్లకు తోడు గ్రాఫిక్స్ జత చేసింది. 

అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ బైక్ 2019 ఫిబ్రవరిలోనే అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో మాత్రం తాజాగా ప్రవేశపెట్టారు. పలు కాస్మోటిక్ అప్‌డేట్స్ తప్ప Suzuki GSX-S750లో మరే మార్పులు లేకుండానే భారతదేశం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు.

749సీసీ-4సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్(10,500ఆర్పీఎం వద్ద 114బీహెచ్‌హెచ్‌పీ), 9,000ఆర్పీఎం వద్ద 81ఎన్ఎం టర్క్. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగివుంది. 41ఎంఎం అప్‌సైడ్-డైన్ కయాబా నుంచి ఫ్రంట్ ఫోర్క్స్‌తో సస్పెన్షన్ హ్యాండిల్ చేయబడుతుంది. రేర్‌లో 7స్టెప్-ప్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనో‌సాక్స్ వీటికి సాయపడతాయి. ఏబీఎస్ స్టాండర్డ్‌తో ఈ మోటార్ సైకిల్‌కి రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 

ఈ సందర్భంగా సుజుకి మోటార్స్ సైకిల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దేవశిష్ హాండా మాట్లాడుతూ.. Suzuki GSX-S750ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. 

కొత్త రెండు కలర్లు, కొత్త గ్రాఫిక్స్‌తో ఈ బైక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు. ఈ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఈ బైక్‌కు కూడా అదే విధమైన రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

Suzuki GSX-S750 చాలా పీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ బైక్ మూడు రకాల కంట్రోల్ సిస్టమ్ కలిగివుంది. లో ఆర్పీఎం అసిస్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టేల్ లైట్స్, నిస్సిన్ సోర్స్‌డ్ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్, డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. కాగా, Suzuki GSX-S750 బైక్.. ట్రంప్ స్ట్రీట్ ట్రిపుల్, డుకాటి మోన్‌స్టర్ 821, కవసాకి జడ్900లకు పోటీనిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

చదవండి: ఏది బెటర్?: హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

Follow Us:
Download App:
  • android
  • ios