Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ వర్షన్‌లోనే విపణిలోకి హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ10’?


దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్’ ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘గ్రాండ్ ఐ10’ అప్ డేటెట్ వర్షన్ మోడల్ కారును ఆవిష్కరించనున్నది. ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 

Upcoming 2019 Hyundai Grand i10 Likely To Get AMT Gearbox
Author
New Delhi, First Published Feb 27, 2019, 1:07 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ త్వరలో మార్కెట్లోకి ఆవిష్కరించనున్నట్లు ‘గ్రాండ్ ఐ10’ మోడల్ కారు కేవలం పెట్రోల్ ఇంజిన్ వర్షన్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. పలు దఫాలు పరీక్షించిన, పరీక్షిస్తున్న హ్యుండాయ్ గ్రాండ్ ‘ఐ10’ మోడల్ కారు ఈ ఏడాది రెండో ద్వితీయార్థంలో మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. 

మారుతి సుజుకి స్విఫ్ట్ నూతన మోడల్ కారు వచ్చే అక్టోబర్ నెలలో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలోనే హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 కారు, మారుతి సుజుకి విటారా బ్రెజ్, హ్యుండాయి స్టైఎక్స్, హ్యుండాయ్ కొనా విద్యుత్ వర్షన్ కారుతో కలిసి మార్కెట్లోకి రానున్నది. 

మోడిఫైడ్ న్యూ గ్రాండ్ ఐ10 కారు పెట్రోల్ వేరియంట్‌లోనే బీఏ ప్లాట్‌ఫామ్‌తోపాటు బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ ఏడాది హ్యుండాయ్ విడుదల చేసే కార్లలో డీజిల్ వర్షన్ మోడల్ కార్లే లేవు.

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 మోడల్ డీజిల్ వేరియంట్ కార్లకు డిమాండ్ పడిపోయింది. బీఎస్ -4 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కార్ల కంటే బీఎస్ -6 ప్రమాణాలతో తయారైన కార్ల ధరలు నషాళానికంటనున్నాయి.

బీఎస్ -6 మోడల్ డీజిల్ వేరియంట్ కార్లు వాడాలంటే భారీగా ధర పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఉత్పత్తులను వినియోగదారులకు కార్ల తయారీ సంస్థలు అందుబాటులోకి తెస్తాయా? అన్నదీ సందేహమే. 

త్వరలో వెలువడనున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 మోడల్ కారులో, ప్రస్తుత మోడల్ మాదిరిగా 4 - స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉండదు. దానికి బదులు ‘స్మార్ట్ - ఆటో’-5 స్పీడ్ ఏఎంటీ మోడల్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. మాన్యువల్, ఆటో వర్షన్ మోడల్ కార్లలో ధరల్లో పెద్దగా తేడా లేకున్నా ఫ్యూయల్ ఎఫిషియెన్సీ చాలా ముఖ్యం. మిడ్ లెవెల్‌లోనూ, హై లెవెల్ లోనూ ఏఎంటీ ఆప్షన్‌లో మెరుగైన గ్రాండ్ ఐ 10 మోడల్ కార్లు లభించే అవకాశాలు పుష్కలం. 

యాంగ్యులర్ క్యాస్కేడింగ్ గ్రిల్లె, బోల్డ్ బంపర్, స్లీక్ హెడ్ ల్యాంప్, డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు చేర్చనున్నారు. ఇంటీరియర్‌గా  కారు చాలా స్పేసియస్‌గా ఉంటుంది. ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు జత కలుస్తాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్ అండ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ తదితర అదనపు ఫీచర్లు కూడా చేరాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios