Asianet News TeluguAsianet News Telugu

2020లో రాబోతున్న డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్

డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ అత్యంత సరసమైన మోడల్‌గా ఉంటుంది, దీనికి ఆల్-బ్లాక్ లుక్ ఇవ్వడానికి కాస్మెటిక్ అప్‌డేట్స్ లభిస్తుంది.

The Ducati Scrambler Icon Dark
Author
Hyderabad, First Published Oct 28, 2019, 5:00 PM IST

డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ 2020 లో 'డార్క్'  కలర్ తో రాబోతుంది, ఇది అత్యంత సరసమైన డుకాటీ స్క్రాంబ్లర్ మోడల్ గా నిలుస్తుంది. ఇటలీలోని రిమినిలో జరిగిన వరల్డ్ డుకాటీ ప్రీమియర్‌లో స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ప్రకటించారు. ఇది చూడడానికి డుకాటీ బేస్ మోడల్ లనే కనిపిస్తుంది. 

కానీ తప్పనిసరిగా కొత్త లూకింగ్ నవీకరణలతో కూడిన కొత్త వేరియంట్, ఇప్పుడు ఇది డుకాటీ స్క్రాంబ్లర్ అత్యంత సరసమైన మోడల్‌గా నిలుస్తుంది.డుకాటీ  ట్యాంక్ మరియు ఫెండర్‌ల యొక్క మాట్టే బ్లాక్ రంగుకు సరిపోయే విధంగా ఉంటుంది. 

also read  విపణిలోకి 3 ప్రీమియం హీరో ‘బైక్’లు: ధర రూ. 94వేల నుంచి మొదలు

ఐకాన్ బ్లాక్‌ను అత్యంత సరసమైన స్క్రాంబ్లర్‌గా మార్చడానికి  బైక్ రియర్ వ్యూ మిర్రర్స్ , ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్లను ప్రామాణిక ఐకాన్ మోడల్‌లో భర్తీ చేస్తుంది, ట్రెడిషనల్  రౌండ్ అద్దాలు, ట్రెడిషనల్  బల్బ్ ఇండికేషన్లతో, స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ యొక్క ఆల్-బ్లాక్ కలర్ థీమ్‌,  బ్లాక్-అవుట్ మెకానికల్స్, కాంట్రాస్టింగ్ బ్రష్ మెటల్ ఫినిష్డ్ అల్యూమినియం ట్యాంక్ ప్యానెల్లు, స్టబ్బీ ఎగ్జాస్ట్ కలిగి ఉన్నాయి, ఇవి బైక్‌కు విలక్షణమైన కొత్త రూపాన్ని ఇస్తాయి. టెక్నికల్  గా  2020 డుకాటీ స్క్రాంబ్లర్‌లో ఎటువంటి మార్పులు లేవు.

The Ducati Scrambler Icon Dark


అదే 803 సిసి, ఎల్-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 73 బిహెచ్‌పి శక్తిని , 67 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 18-అంగుళాల ముందు, 17-అంగుళాల వెనుక చక్రాలకు పిరెల్లి MT 60 RS టైర్లు లభిస్తాయి. ముందు చక్రానికి 330 mm డిస్క్‌ను నాలుగు-పిస్టన్ బ్రేక్ కాలిపర్ లభిస్తుంది, వెనుక చక్రంలో 245 mm డిస్క్‌తో సింగిల్-పిస్టన్ కాలిపర్ బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షన్ 41 mm కయాబా విలోమ ఫోర్క్, వెనుక భాగంలో  అడ్జస్టబుల్ చేయగల సింగిల్ మోనోషాక్ తో ఉంటుంది.

also read భాగ్య నగరిలో బెనెల్లీ ప్లాంట్‌.. ఈ ఏడాది విపణిలోకి నాలుగు బైక్స్

స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ప్రతిదీ నలుపు రంగులో ఉంటుంది, కేవలం ఎగ్జాస్ట్ సైలెన్సర్ స్టెయిన్ లెస్  స్టీల్‌తో పూర్తయ్యాయి. అల్యూమినియం ఫినిష్ ఎగ్జాస్ట్ ఎండ్ రూపాన్ని కనిపిస్తుంది. డుకాటీ ఇండియా స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ను 2020 మోడల్‌గా పరిచయం చేయలని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios