Asianet News TeluguAsianet News Telugu

ఈ-కామర్స్‌లోకి టాటామోటార్స్.. ట్రావెల్స్ సెగ్మెంట్‌లో ‘వింగర్’

టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి ట్రావెల్ యూజ్ వాహనాలను వింగర్ -12, వింగర్ -15 వ్యాన్లను విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం కర్ణాటకలోని డీలర్లందరి వద్ద లభ్యం అవుతాయి. మరోవైపు టాటా మోటార్స్ బుధవారం నుంచి బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ-కామర్స్ ఎక్స్ పోలో తన అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నది.

Tata Motors launches vans for travel segment
Author
Bengaluru, First Published Feb 18, 2019, 10:53 AM IST

బెంగళూరు: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ట్రావెల్ సెగ్మెంట్లో అడుగు పెట్టింది. ‘వింగర్ -12 సీటర్’, ‘వింగర్-15 సీటర్’ పేరిట రెండు వాహనాలను విపణిలోకి ప్రవేశపెట్టింది. మంగళూరు, బెంగళూరు, హుబ్లీ సహా కర్ణాటకలోని 16 టాటా మోటార్స్ డీలర్ల వద్ద ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయి. 

ఈ సందర్భంగా టాటామోటార్స్ సేల్స్ హెడ్ సందీప్ కుమార్ మాట్లాడుతూ శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు, పర్యావరణ అంశాలకు పరిష్కారంగా తాము ట్రావెల్ సెగ్మెంట్ వాహనాలను ఆవిష్కరించామని తెలిపారు. టాటా వింగర్ 12, టాటా వింగర్ 15 మోడల్ వాహనాలు ఇంధన పొదుపుతోపాటు టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్ల లావాదేవీల్లో గేమ్ చేంజర్లు కానున్నాయన్నారు. ప్రయాణికుడికి సౌకర్యవంతంగా ఉండటంతోపాటు ఆపరేటర్‌కు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకే ఈ వింగర్ 12, వింగర్ 15 వాహనాలను రూపొందించామన్నారు. 

ఇదిలా ఉంటే ఈ నెల 20 - 22 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే ఈ- కామర్స్ ఎక్స్ పోలో టాటా మోటార్స్ పూర్తిగా వినియోగానికి సిద్ధంగా ఉన్న 13 వాహనాలను ప్రదర్శించనున్నది. స్మాల్ కమర్షియల్, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్‌లో కొన్ని బెస్ట్ సెల్లింగ్ వేరియంట్లు కానున్నాయని టాటా మోటార్స్ పేర్కొంది. 

ఈ-కామర్స్ పరిశ్రమ అవసరాలపై విస్తుత స్థాయి అధ్యయనం తర్వాతే వీటిని డెవలప్ చేశామని తెలిపింది. ఈ- కామర్స్ వెండార్స్‌తో కలిసి పూర్తిగా సొంత ఇంజినీర్లతో టాటామోటార్స్ వీటిని డిజైన్ చేసింది. ఏస్ డెలివరీ వాన్ ఫోర్-కామర్స్ గూడ్స్, ఏస్ జిప్ ప్యానెల్ వాన్ ఫోర్ ఈ-కామర్స్ ప్యాకేజేస్, సూపర్ ఏస్ మింట్ ఎక్స్ పీఎస్ వంటి వాహనాలతో భారీ సరుకులు రవాణా చేయొచ్చు. 

ఈ-కామర్స్ ప్లేయర్లు, ట్రాన్స్ పోర్టర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్లను ఈ-కామర్స్ ఎక్స్ పో 2019 నెరవేరుస్తుందని టాటామోటార్స్ విశ్వసిస్తోంది. స్మార్ట్ సొల్యూషన్స్‌తో నూతన తరం ఉత్పత్తుల రూపకల్పనపై ద్రుష్టిని కేంద్రీకరించామని తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios