Asianet News TeluguAsianet News Telugu

మల్టీ పర్సస్+ఎస్‌యూవీలపైనే మోజు: ఎర్టిగా వర్సెస్ మరాజ్జో


కార్ల వినియోగదారుల్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మల్టీ పర్పస్ వెహికల్స్ గా ఉన్న ఎస్ యూవీ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మారుతి న్యూ ఎర్టిగ, మహీంద్రా మర్రాజో మోడల్ కార్లకు వినియోగదారుల్లో యమ క్రేజీ పెరిగింది. 

Shifting consumer preference: MPV-SUV race takes a new, interesting turn
Author
New Delhi, First Published Dec 31, 2018, 1:44 PM IST

కార్ల వినియోగదారుల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రపంచంలోనే శరవేగంగా దూసుకెళుత్తున్న కార్ల మార్కెట్ భారతదేశంలో పలు రకాలుగా వినియోగించుకోవడానికి వీలుగానూ, ఎస్‌యూవీ మోడల్ కార్లపైనే వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని నెలలుగా అత్యధిక వినియోగంతోపాటు ఇంధన సామర్థ్యం గల మల్టీ పర్పస్, ఎస్‌యూవీ వెహికల్స్ సుమారు 70 వేల మంది కొనుగోలు చేశారు. 

ప్రత్యేకించి మహీంద్రా మరాజ్జో, మారుతి సుజుకి రీ డిజైన్ చేసిన ఎర్టిగా మోడల్ కార్ల రాకతో ఇంతకుముందు మార్కెట్లోకి వచ్చిన ఎస్ యూవీ, తదితర మోడల్ కార్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. 

నూతన మల్టీ పర్పస్ వెహికల్స్‌లో త్రీ సీటింగ్ ‘రో’లు ఏర్పాటు చేస్తున్నాయి కార్ల తయారీ సంస్థలు. తద్వారా పెద్ద కుటుంబాలు వారాంతంలో జాలీగా ఒకే కారులో విహార యాత్రకు వెళ్లడానికి వీలు కల్పిస్తున్నాయి. అత్యంత స్టైలిష్‌గానూ రూపుదిద్దుకుంటున్న నూతన తరం మల్టీ పర్పస్ వెహికల్స్‌లో పలు రకాల అదనపు ఫీచర్లతోపాటు అత్యున్నత వినియోగ సామర్థ్యం, ఇంధన వినియోగ సామర్థ్యం పెంపొందిస్తున్నారు. 

ప్రస్తుతం మారుతి ఎర్టిగా కోసం ప్రతి రోజూ సగటున 800 బుకింగ్స్ నమోదవుతున్నాయని సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లేందుకు వీలవుతుంది. మున్ముందు వారాంతంలో స్నేహితులు, సహచర ఉద్యోగులతో కలిసి వెళ్లడానికి వీలుగా మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంవీపీ) సిద్ధం అయ్యాయి. 

మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంవీపీ) విభాగంలో న్యూ మారుతి ఎర్టిగా, మహీంద్రా మర్రాజో వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే మోడల్ కార్లను రెనాల్ట్ అండ్ నిస్సాన్ సంస్థలు అందుబాటులోకి తేనున్నాయి. ఇక భారత మార్కెట్లోకి రావాలని కలలు కంటున్న కియా అండ్ ఎంజీ మోటార్స్ కూడా ఎంవీపీలను విడుదల చేయాలని తలపోస్తున్నాయి. మారుతి సుజుకి ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన ఎర్టిగాకు ప్రీమియం మోడల్ కారు త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నది. న్యూ మారుతి ఎర్టిగా ప్రీమియం మోడల్ 10 శాతం విక్రయాలను పెంచుతుందని అంచనా. 

ఇక మహీంద్రా మర్రాజ్జో నెలా 2500 - 3000 యూనిట్లు అమ్ముడు పోతున్దని. 45 రోజుల్లో 18 వేలకు పైగా కార్ల కోసం వినియోగదారులు క్యూలో నిలుచున్నారు. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్ విజయ్ నక్రా మాట్లాడుతూ మర్రాజో వంటి మోడల్ కారు వినియోగదారులకు కంఫర్ట్ గా ఉంటుందన్నారు. ఇంధన వినియోగ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios