Asianet News TeluguAsianet News Telugu

‘రోల్స్ర్ రాయిస్’రికార్డు: 115 ఏళ్లలో ఇదే ప్రథమం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ 2018లో విలాసవంతమైన కార్లను విక్రయించడంలో రికార్డు నెలకొల్పింది. 1998 నుంచి బీఎండబ్ల్యూ మోడల్ కార్లను తయారుచేసి విక్రయిస్తున్న సంస్థ ‘రోల్స్ రాయిస్’. 

Rolls-Royce Breaks Record for Luxury Car Sales
Author
New Delhi, First Published Jan 13, 2019, 11:02 AM IST


ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ 2018లో విలాసవంతమైన కార్లను విక్రయించడంలో రికార్డు నెలకొల్పింది. 1998 నుంచి బీఎండబ్ల్యూ మోడల్ కార్లను తయారుచేసి విక్రయిస్తున్న సంస్థ ‘రోల్స్ రాయిస్’. 2018లో ఘోస్ట్, ఫంటోమ్ తదితర విలాసవంతమైన కార్లు 4,107 కార్లను విక్రయించింది. ఇది రోల్స్ రాయిస్ 115 ఏళ్ల రికార్డును తిరగరాసింది.  

1998లో ప్రతిష్ఠాత్మక బ్రాండ్ బీఎండబ్ల్యూ అవార్డు అందుకున్నది రోల్స్ రాయిస్. గతేడాది రికార్డు స్థాయిలో కార్లను రోల్స్ రాయిస్ విక్రయించింది. 50కి పైగా దేశాల్లో కార్ల విక్రయాలు సాగిస్తోంది రోల్స్ రాయిస్. 2017తో పోలిస్తే 2018లో 22 శాతానికి పైగా కార్ల విక్రయాలు సాగించింది. 2017లో 3,362 రోల్స్ రాయిస్ కార్లను విక్రయించింది. తొలిసారి 2000 మందికి నూతన ఉద్యోగాలు కల్పించింది రోల్స్ రాయిస్. బ్రిటన్ లో రోల్ రాయిస్ యూనిట్లో తయారైన కార్లు అమెరికాలో చాలా ప్రజాదరణ పొందాయి కూడా. 

రోల్స్ రాయిస్ సీఈఓ టార్స్టెన్ ముల్లర్ ఒట్వోస్ మాట్లాడుతూ తమ సంస్థకు 2018 మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇయర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కార్ల విక్రయాల్లో రికార్డు నెలకొల్పిందని తెలిపారు. 2018లో బలీయమైన మార్కును నమోదు చేశామని, 2019లోనూ గొప్ప సాధించగలమని తమకు విశ్వాసం ఉన్నదని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios