Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణ వాహన విక్రయాలు నాలుగో‘సారీ’..బైక్స్ సేల్స్ ఓకే?!

వరుసగా ప్రయాణికుల వాహనాల విక్రయాలు నాలుగో నెలలో పతనం అయ్యాయి. ఇంధన ధరలు, అధిక వడ్డీరేట్ల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని సియాం డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు.

Passenger vehicle sales decline 3.43 pc in November; car sales too dip marginally
Author
New Delhi, First Published Dec 12, 2018, 11:01 AM IST

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణ వాహనాల విక్రయం నవంబర్ నెలలో 3.43 శాతం తగ్గుముఖం పట్టింది. 2017 నవంబర్ నెలలో 2,75,440 వాహనాలు అమ్ముడు పోతే, ఈ ఏడాది 2.66 లక్షల వెహికల్స్ విక్రయమయ్యాయి. దేశీయ కార్ల విక్రయాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 

గతేడాది నవంబర్ నెలలో 1,81,435 కార్లు అమ్ముడు పోతే ఈ ఏడాది 1,79,783 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జూలై నుంచి వరుసగా ప్రయాణ వాహనాల విక్రయాలు వరుసగా తగ్గిపోవడం నాలుగు నెల కావడం గమనార్హం. కాకపోతే అక్టోబర్ నెలలో మాత్రం 1.55 శాతం పెరిగినా.. అంతకుముందు వరుసగా మూడు నెలల్లో విక్రయాల్లో క్షీణత నమోదైంది. జూలైలో 2.71 శాతం, ఆగస్టులో 2.46 శాతం, సెప్టెంబర్ నెలలో 5.61 శాతం విక్రయాలు పడిపోయాయి. 

గతేడాదితో పోలిస్తే గత నెలలో మోటారు సైకిళ్ల విక్రయాలు మాత్రం 9.36 శాతం పెరిగాయి. గతేడాది నవంబర్ నెలలో 9,59,860 మోటార్ బైక్‌లు అమ్ముడు పోతే గత నెలలో 10,49,659 అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహనాలు మొత్తం కూడా నవంబర్ నెలలో 7.15 శాతం పెరిగాయి. ఏడాది క్రితం 15,36,015 ద్విచక్ర వాహనాలు అమ్ముడు పోగా, గత నెలలో 16,45,791 యూనిట్లు విక్రయించారు. 

వాణిజ్య వాహనాల విక్రయం 5.71 శాతం పెరిగింది. గతేడాది కంటే 5.71 శాతం విక్రయాలు పెరిగి 72,812 వాణిజ్య వాహనాలు అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వివిధ విభాగాల్లో వాహనాల విక్రయాలు 5.03 శాతం అమ్ముడయ్యాయి. 2017 నవంబర్ నెలలో 19,40,462 వాహనాలను విక్రయిస్తే, గత నెలలో 20,38,015 వెహికల్స్‌ను ఆయా ఆటోమొబైల్ సంస్థలు విక్రయించాయని సియామ్ తెలిపింది. 

సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ మాట్లాడుతూ అధిక వడ్డీరేట్లు, పెరిగిన ఇంధన ధరల వల్లే విక్రయాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు తగ్గుతున్నందున వాహనాల కొనుగోళ్లపై సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. కాకపోతే అన్ని విభాగాల విక్రయాల్లో పురోగతి నమోదైందన్నారు. త్రీ వీలర్ వెహికల్స్ విక్రయాలు 21 శాతానికి పైగా, టూ వీలర్స్ విక్రయాలు 10 శాతానికి పైగా, వాణిజ్య వాహనాల విక్రయాలు 31 శాతానికి పైగా సాగాయి.  అయితే గతేడాది మాదిరిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర విక్రయాల్లో 7-8 శాతం పురోగతి నమోదు కావడం కష్ట సాధ్యమేనని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios