Asianet News TeluguAsianet News Telugu

వచ్చేనెలలో మార్కెట్లోకి మారుతి న్యూ ‘వాగన్ ఆర్’?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘వాగన్ ఆర్’ 2019 మోడల్ కారును సిద్ధం చేసింది. ఇది వచ్చేనెలలో మార్కెట్లోకి ప్రవేశించనున్నది. అంతేకాదు టాటా మోటార్స్ వారి టియాగో, హ్యుండాయ్ శాంత్రో, రెనాల్డ్ క్విద్ మోడల్ కార్లతో మారుతి సుజుకి వాగన్ ఆర్ పోటీ పడనున్నది. 

New Maruti WagonR 2019 spied inside company plant before launch
Author
New Delhi, First Published Dec 29, 2018, 10:47 AM IST


న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల తయారీలో పేరెన్నికగన్న మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) తాజాగా వాగన్ ఆర్ మోడల్ కారును డిజైన్ చేస్తోంది. ఈ కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెలలో మార్కెట్లోకి ప్రవేశించనున్న ‘నూతన మారుతి వాగన్ ఆర్’ మోడల్ కారు కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నూతన ‘మారుతి వాగన్ ఆర్’ కారు తమ ప్రత్యర్థి సంస్థలు హ్యుండాయ్ శాంత్రో, రెనాల్ట్ క్విద్, టాటా మోటార్స్ వారి టియాగో మోడల్ కార్లకు గట్టి పోటీనివ్వనున్నది. సంప్రదాయ పద్దతులకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న మారుతి వాగన్ ఆర్ ఎక్స్ టీరియర్ డిజైన్ పూర్తిగా న్యూ లుక్ సంతరించుకోనున్నది. 

ఎక్స్‌టర్నల్ ఎడ్జెస్‌తోపాటు రెక్టాంగ్యులర్ గ్రిల్, న్యూ ఫ్రంట్ ఎండ్ ఫీచర్లతో  ఫంకీ హెడ్ ల్యాంప్స్ రూపుదిద్దుకున్నాయి. వీటికి అదనంగా క్రోమ్ స్ట్రిప్, బ్లాక్ చిన్ క్వాడ్రిలాటరల్ ఫాగ్ లైట్ ఎంక్లోజర్ జత కలిపారు. న్యూ హ్యాచ్ బ్యాక్ కారు పూర్తిగా ఆధునీకరించారు. ప్రమాదాల నుంచి బయటపడేందుకు పూర్తిస్థాయి రక్షణ కోసం డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగ్, రేర్ ప్యాకింగ్ ఫీచర్ అమర్చారు. 

దీనికి అదనంగా స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 2019 మారుతి వాగన్ ఆర్ మోడల్ కారు పాత మోడల్ కారుతో పోలిస్తే కొన్ని మార్పులతో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర రూ.4.5 లక్షలు పలుక వచ్చునని భావిస్తున్నారు. దీనికి ఏఎంటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios