Asianet News TeluguAsianet News Telugu

23న మార్కెట్లోకి మారుతి న్యూ వ్యాగన్ఆర్.. బుకింగ్స్ షురూ!!

అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూ మోడల్ ‘మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌’ కారు మార్కెట్లో అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించేందుకు మారుతి సుజుకి అన్ని ఏర్పాట్లు చేసింది

New Maruti Suzuki Wagon R Official Bookings Open
Author
New Delhi, First Published Jan 20, 2019, 4:00 PM IST

ముంబై: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూ మోడల్ ‘మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌’ కారు మార్కెట్లో అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించేందుకు మారుతి సుజుకి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలే ఈ కారు వీడియోలను మారుతీ సుజుకీ విడుదల చేసింది. 
అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమైన ఐదో తరం మారుతి వాగన్ ఆర్ మోడల్ కారు సరికొత్త వేగనార్‌ క్యాబిన్‌లో భారీ మార్పులు చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. నూతన మారుతి వ్యాగన్ ఆర్ మోడల్ కారు ఏడు వేరియంట్లలో వినియోగదారుడికి అందుబాటులోకి రానున్నది.

వాటిలో నాలుగింట ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అమర్చారు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఆవిష్కరించనున్న వేరియంట్లు: ఎల్ఎక్ష్ఐ 1.0లీ, వీఎక్ష్ఐ 1.0 లీ, వీఎక్ష్ఐ ఏజీఎస్ 1.0 లీ, వీఎక్ష్ ఐ 2.0 లీ, వీఎక్ష్ఐ ఏజీఎస్ 1.2 లీ, జడ్ఎక్ష్ఐ 1.2 లీ, జడ్ఎక్ష్ఐ ఏజీఎస్ 1.2 లీ. ఈ కారు ఆరు ఎక్స్ టీరియర్ రంగుల్లో లభించనున్నది. కారు ధర రూ.4.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు పలుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్ ఆర్ కారు కంటే కొంచెం పొడవుగాగా ఉంటుంది. 

వినియోగదారులకు అందుబాటులోకి రానున్న మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారులో డ్యాష్‌బోర్డును పూర్తిగా మార్చేశారు. దీనికి స్మార్ట్‌‌ టచ్‌ స్క్రీన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఉన్నాయి. నలుపు, బూడిద రంగుల్లో డ్యాష్‌బోర్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు సరికొత్త ఏసీ ఎయిర్‌ కండీషన్‌ వెంట్‌లను కూడా అమర్చారు.  స్టీరింగ్‌లో కూడా మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆడియో, టెలిఫోన్‌ కంట్రోల్స్‌ను స్టీరింగ్‌పైనే అమర్చారు. దీంతోపాటు ఆటోగేర్‌ ఫీచర్‌ను కూడా అందించనుంది.

1.0 లీటర్, 3 - సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం గల 67 బీహెచ్పీ పవర్, 90 ఎన్ఎం టార్చితో కూడిన నూతన హ్యాచ్ బ్యాక్ కారు 1.2 లీటర్లు, 4 - సిలిండర్ కే12 సామర్థ్యం గల ఇంజిన్‌ను అమర్చారు. నూతన మారుతి వ్యాగన్ ఆర్ మోడల్ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా మోటార్స్ వారి టియాగో, హ్యుండాయ్ శాంత్రో మోడల్ కార్లతో ఢీ కొట్టనున్నది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios